ETV Bharat / international

540 కోట్ల నకిలీ ఖాతాలపై ఫేస్​బుక్ వేటు - fake accounts of facebook

నకిలీ ఖాతాలపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా 540 కోట్ల ఫేక్​ అకౌంట్లను ఫేస్​బుక్​ నిలిపివేసింది. నిఘా వ్యవస్థల ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నట్లు ఫేస్​బుక్​ తెలిపింది. ఇందుకోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది.

540 కోట్ల నకిలీ ఖాతాలపై ఫేస్​బుక్ వేటు
author img

By

Published : Nov 14, 2019, 10:46 AM IST

అసత్య సమాచార వ్యాప్తిని నివారించి, నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ మరో ముందగుడు వేసింది. నకిలీవిగా తేలిన దాదాపు 540 కోట్ల అకౌంట్లను ఈ ఏడాది రద్దు చేసినట్లు పేర్కొంది. నకిలీ ఖాతాలను సృష్టించడానికి చేసే ప్రయత్నాలను పసిగట్టే పద్ధతులను మెరుగుపర్చుకున్నట్లు 'పారదర్శకత నివేదిక'లో ఫేస్​బుక్​ స్పష్టం చేసింది.

సమాచారం ఎక్కడినుంచి ఉత్పన్నమవుతుందనేది తెలియని విధంగా వినియోగదారులను మభ్య పెట్టే ఖాతాలను అరికట్టడం సహా రాజకీయ, సామాజిక అజెండాలతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని అరికట్టడానికి ఫేస్​బుక్​ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.

'నకిలీ ఖాతాలను నిలువరించడంలో ప్రగతి సాధించినందుకు సంతృప్తిగా ఉంది. ఈ సాంకేతికతలు పరిపూర్ణంగా లేవు. తప్పులు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అందువల్లే కచ్చితత్వాన్ని పెంపొందించడం సహా మా నిబంధనలకు వ్యతిరేకంగా సమాచార వ్యాప్తి చేస్తున్న ఖాతాలను అరికట్టడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం.'
-ఫేస్​బుక్​

భారీగా ప్రభుత్వాల అభ్యర్థనలు

వినియోగదారుల సమాచారం కోరుతూ అమెరికా ప్రభుత్వం పంపిన అభ్యర్థనలు కూడా పెరిగినట్లు నివేదికలో స్పష్టమైంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో వివిధ దేశాల నుంచి 1,28,617 అభ్యర్థనలు అందినట్లు వెల్లడించింది.

'ప్రభుత్వం నుంచి వచ్చే అభ్యర్థనలు న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయో లేదో అనేది ఖాతా సమాచారాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకుంటాం. ఏ దేశ ప్రభుత్వం అభ్యర్థించినా జరిగేది ఇదే.'
-క్రిస్ సోండర్​బై, ఫేస్​బుక్ న్యాయ సలహాదారుడు.

ఖాతాదారుల సమాచారం కోరుతూ వచ్చిన అభ్యర్థనల్లో అమెరికా(50,741) నుంచే అధికంగా ఉన్నాయి. భారత్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు నివేదిక తెలిపింది.

Tirumala (AP), Nov 14 (ANI): Bollywood diva Deepika Padukone reached Andhra Pradesh's Tirumala. She was accompanied by her husband and actor Ranveer Singh. The couple is in Tirumala to celebrate their first wedding anniversary. They are likely to offer prayers at Balaji and Padmavati Temple. Ranveer and Deepika tied the knot at Lake Como in a glamorous Konkani wedding on November 14 which was followed by Sindhi wedding on November 15.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.