అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్వాగతించినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. జో బైడెన్‌ను అమెరికా తదుపరి అధ్యక్షుడిగా అంగీకరించిన తొలి దిగ్గజ సాంకేతిక సంస్థ అధిపతిగా నిలిచారని పేర్కొంది.
నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించిన విషయం స్పష్టమైందని జుకర్‌బర్గ్ తన సంస్థలోని ఉద్యోగులకు చెప్పారని బజ్‌ఫీడ్ అనే వార్తా సంస్థ పేర్కొంది.
"ఎన్నికల ఫలితం ఇప్పుడు స్పష్టంగా ఉంది. జో బైడెన్ మన తదుపరి అధ్యక్షుడు కాబోతున్నారు. ఎన్నికలు ప్రాథమికంగా సవ్యంగానే జరిగాయని ప్రజలు విశ్వసించడం ముఖ్యం. ట్రంప్‌కు ఓటేసిన కోట్లాది మంది ప్రజలకూ ఇదే వర్తిస్తుంది."
-మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్బుక్ సీఈఓ
ఎన్నికల ఫలితాలపై కొంత మంది న్యాయపోరాటానికి మొగ్గుచూపుతున్నారని, రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఇది వారి హక్కు అని చెప్పారు. అయితే రీకౌంటింగ్తో పెద్దగా ఉపయోగం లేదని అన్నారు. 'ముందస్తు అంచనాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని కొంతమంది అనుకుంటున్నారు. వారి ప్రయత్నాలు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చ'ని పేర్కొన్నారు. ఎన్నికలపై తప్పుడు వార్తలను ట్రంప్ షేర్ చేయడాన్ని వ్యతిరేకించారు.
ఇదీ చదవండి- డెంగీ, మలేరియా చికిత్సలకు బీమా పాలసీలు