ETV Bharat / international

'ఆ బోయింగ్ విమానాలను సమీక్షించండి'

author img

By

Published : Feb 22, 2021, 11:29 AM IST

బోయింగ్​ 777 విమానాలను సమీక్షించాలని యునైటెడ్​ ఎయిర్​లైన్స్​ సంస్థను అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల జరిగిన ప్రమాదం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.

america, flights
యునైటెడ్​ ఎయిర్​లైన్స్​పై అమెరికా కీలక ఆదేశాలు

విమానయాన సంస్థ యునైటెడ్​ ఎయిర్​లైన్స్​కు చెందిన​ బోయింగ్ 777 విమానాలను సమీక్షించాలని ఆ సంస్థకు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంజిన్​ సమస్యలతో శనివారం ఓ బోయింగ్ 777 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రమాదానికి గురైన ఇంజిన్​ పోలి ఉన్న విమానాలను క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేసింది.

"విమానం ఇంజిన్​కు సంబంధించిన ఫ్యాన్లలో రెండు విరిగిపోయాయి. మిగతావి స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనపై ఇప్పుడే ఓ అంచనాకు రావడం సరికాదు. అమెరికా విమానయాన సంస్థల్లో యునైటెడ్​ ఎయిర్​లైన్స్​ మాత్రమే వైట్నీ పీడబ్ల్యూ 4000 ఇంజిన్​ విమానాలను వినియోగిస్తోంది. కాక్​పిట్​ వాయిస్​ రికార్డర్, ఫ్లైట్​ డేటా రికార్డర్​లను వాషింగ్​టన్​లోని ల్యాబ్​కు తరలించాము."

-జాతీయ రవాణా భద్రతా బోర్డు, అమెరికా

ఈ ఘటనలో దర్యాప్తునకు సహకరిస్తామని యునైటెడ్ ఎయిర్​లైన్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ రకమైన విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 'ప్రభుత్వ సూచనలు అనుసరించి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని సేవల పునరుద్ధరణకు కృషి చేస్తాం,' అని పేర్కొంది.

ఇదీ జరిగింది..

యూనైటెడ్​ ఎయిర్​లైన్స్​కు చెందిన బోయింగ్​ 777 విమానం శనివారం ప్రమాదానికి గురైంది. ప్రాట్​ అండ్​ వైట్నీ పీడబ్ల్యూ 4000 ఇంజిన్​తో నడిచే ఈ విమానంలో కుడివైపు ఉన్న ఇంజిన్​లో పేలుడు సంభవించింది. దీంతో కొలరాడోలోని డెన్వర్​ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్​లో 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. అదృష్టతవశాత్తు ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. అయితే విమానం గాల్లో ఉన్నప్పుడు.. దాని నుంచి వస్తువులు కిందపడ్డాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇదీ చదవండి : విమాన ప్రయాణం మరింత భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.