ETV Bharat / international

కరోనా నుంచి వ్యాయామం ఎలా కాపాడుతుందంటే? - తాజా వార్తలు కరోనా

కరోనాను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉండబోవని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

exercise
కరోనా నుంచి వ్యాయామం ఎలా కాపాడుతుందంటే!
author img

By

Published : Apr 16, 2020, 5:20 PM IST

క్రమం తప్పకుండా కసరత్తులు చేయడం వల్ల కొవిడ్‌-19 తీవ్ర లక్షణాలను తగ్గించుకోవచ్చని కొందరు పరిశోధకులు అంటున్నారు. కరోనా వైరస్‌ ప్రధాన లక్షణమైన శ్వాస తీసుకోలేకపోవడం (అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌-ఏఆర్‌డీఎస్‌) సమస్యకు ఇది అడ్డుకట్ట వేస్తుందంటున్నారు. ఈ వ్యాధికి చికిత్స అందించేందుకు నిరంతర ఎక్సర్‌సైజ్‌ ఉపయోపడుతోందని తేల్చారు.

అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయ బృందం ఈ పరిశోధన చేపట్టింది. రెడాక్స్‌ బయాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. కరోనా ప్రధాన లక్షణమైన ఏఆర్‌డీఎస్‌ నుంచి రక్షించుకొనేందుకు కసరత్తు గణనీయంగా ఉపయోగపడుతుంది. కొవిడ్‌-19 రోగుల్లో ఏఆర్‌డీఎస్‌పై ఇది 3 నుంచి 17 శాతం ప్రభావం చూపిస్తోంది. అమెరికా వ్యాధులు నియంత్రణ సంస్థ ప్రకారం కరోనా రోగుల్లో 20-42 శాతం మందిలో శ్వాస ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందులో 67-85 శాతం మంది ఐసీయూలో చేరుతున్నారు. తీవ్ర ఏఆర్‌డీఎస్‌తో బాధపడుతున్న వారిలో 45 శాతం మృతిచెందుతున్నారని తెలిసింది.

"దాదాపు 80% కరోనా రోగుల్లో స్వల్ప మోతాదులో లక్షణాలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌-19తో తలెత్తుతున్న శ్వాస సమస్యకు చికిత్స అందించేందుకు ఎండోజీనియస్‌ యాంటీ ఆక్సిడెంట్‌ ఎంజైమ్‌ పనిచేస్తున్నట్టు మేం గుర్తించాం. దీనిని ఎక్స్‌ట్రా సెల్యూలార్‌ సూపర్‌ఆక్సైడ్‌ డిస్‌మ్యూటేస్‌ (EcSOD) అంటారు. ఇది హానికరమైన ఫ్రీర్యాడికల్స్‌ను వెంటాడి రోగం నుంచి మన కణజాలాన్ని రక్షిస్తుంది. సాధారణంగా మన కండరాలు EcSODని తయారుచేసి ఇతర అంగాలకు పంపిస్తాయి. హృదయ సంబంధ (కార్డియో) కసరత్తులు చేస్తే ఇది ఎక్కువగా విడుదల అవుతుంది. ఊపిరితిత్తులు, హృదయం, మూత్రపిండాలు వైఫల్యం చెందినప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్‌ తగ్గుతోంది. మనం ఎప్పటికీ ఐసోలేషన్‌లో ఉండలేం. కసరత్తులు చేసి ఈ యాంటీ ఆక్సిడెంట్‌ ద్వారా ఏఆర్‌డీఎస్‌ నుంచి రక్షించుకోవచ్చు" - పరిశోధకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.