కరోనాకు అడ్డుకట్ట వేసే సంజీవనిగా భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తి తీవ్ర దుష్ప్రభావాలు తప్పవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కొవిడ్-19 చికిత్సలో మలేరియా నివారణకు వాడే ఈ ఔషధం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పినప్పటికీ దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్టులు ఉన్నాయి.
ఆ ఔషధం ఉపయోగపడుతుంది
కరోనా చికిత్సకు మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉపయోగించవచ్చని సూచించినప్పటికీ దీనిని బాధితులకు ఇవ్వడం వల్ల గుండె జబ్బులు పెరిగే ప్రమాదమే అధికమని గుర్తించారు. ప్రస్తుతం ఈ ఔషధ అభివృద్ధిపై నిర్వహిస్తోన్న ప్రయోగాలను నిలిపివేశారు. బ్రెజిల్‌లోని ట్రాపికల్ మెడిసిన్ ఫౌండేషనల్ 440 మందికి ఈ మందును ఇచ్చి వారి గుండె సంబంధిత జబ్బులను పరిశీలించారు. ఇదే పరీక్షల్లో హెచ్ఐవీ చికిత్సకు ఉపయోగించే ఔషధం కొవిడ్ నివారణకు ఉపయోగపడుతుందని వెల్లడించారు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు
- శరీరంపై బొబ్బలు, చర్మం తొక్క ఊడటం, చర్మం వదులుగా మారడం.
- చూపు మందగించడం, ఇతర దృష్టి సమస్యలు.
- దగ్గు, గొంతు బొంగురుపోవడం.
- మూత్రం ముదురుగా మారడం.
- విరేచనాలు.
- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు.
- సాధారణ, చలి జ్వరం.
- అలసట, బలహీనంగా ఉండటం.
- తలనొప్పి.
- కళ్లు ఎరుపు రంగులోకి మారడం.
- పెదవులు, నోట్లో పుండ్లు, పూత, తెల్లని మచ్చలు.
- మెడ, నాలుక, చేతులు, కాళ్లలో నియంత్రణ లేని మెలికల కదలికలు.
అధిక మోతాదు లక్షణాలు
- నిద్ర మత్తులా ఉండటం.
- నోరు తరచుగా ఎండిపోవడం.
- ఆకలి తగ్గిపోవడం.
- మతిస్థిమితం లేకపోవడం.
మరికొన్ని సైడ్ ఎఫెక్ట్లు
- వికారం.
- పీడ కలలు లేదా చెడు కలలు.
- నియంత్రణ కాని కళ్ల కదలికలు.
- గుండె వైఫల్యం, బివెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ.
- కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు.
- సైకోలా ప్రవర్తించడం, ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నం.
తీవ్రస్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అందిస్తే
- కంటి సమస్యలు, రెటీనా దెబ్బతినే ప్రమాదం.
- గుండె జబ్బులు.
- మధుమేహం.
- పొట్ట సంబంధిత రుగ్మతలు.
- అలర్జీ.
- కాలేయం, కిడ్నీ సమస్యలు.
- సోరియాసిస్.
- ఆల్కాలిజం.
- పోర్ఫిరియా, గ్లూకోజ్-6-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేస్ (జీ6పీడీ) లోపం.
ఇదీ చదవండి: చైనా నుంచి భారత్‌కు 6.5 లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు