Ecuador Landslide: ఈక్వెడార్ రాజధానిలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 22 మంది మరణించిగా.. మరో 32 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాలు నివాసం ప్రాంతంలో పడటం వల్ల ఎనిమిది ఇళ్లు ధ్వంసమయ్యాయి. నగర వీధులు, క్రీడా మైదానాల్లోకి బురద నీరు ప్రవేశించింది.
రూకో పిచించా పర్వత శ్రేణుల దిగువన ఉన్న లా గాస్కా, లా కొమునా పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా వరదలు ముంచెత్తాయి. దాదాపు 10 అడుగుల ఎత్తు మేర బురద నీరు నగరాల్లో ప్రవేశించింది. దాంతో పాటే చెట్లు, పలు వాహనాలు కొట్టుకుపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బందితో పాటు ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: కంట్రోల్ తప్పిన రాకెట్.. అస్తవ్యస్తంగా చక్కర్లు.. మార్చిలో చంద్రుడ్ని ఢీ!