ETV Bharat / international

'భారత్​తో కలిసే కొవిడ్​పై పోరాటం'

కొవిడ్​పై పోరాటంలో భారత్​కు సాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. భారత్​కు త్వరతిగతిన వ్యాక్సిన్లు పంపించనున్నట్లు పేర్కొంది. దీనిపై స్పందించిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్​ సభ్యుడు రాజా క్రిష్ణమూర్తి.. భారత్​కు మరిన్ని టీకాలు సాయం చేయడం అత్యవసరం అని అన్నారు.

author img

By

Published : Aug 7, 2021, 8:50 AM IST

Updated : Aug 7, 2021, 11:38 AM IST

US, US aid to india
అమెరికా

కొవిడ్​పై పోరులో భాగంగా భారత్​తో కలిసి పనిచేసేందుకు బైడెన్​ బృందం ఆతృతగా ఉన్నట్లు శ్వేతసౌధం పేర్కొంది. వ్యాక్సిన్ల రూపంలో చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

భారత్​కు వ్యాక్సిన్లు అందించడం ఆలస్యమవుతోందని అందుకు వాషింగ్టన్​ కారణం కాదని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జెన్​ సాకి తెలిపారు.

అయితే.. కొన్ని దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేయడం కోసం చట్టపరమైన, నియంత్రణ సమస్యలను పరీశీలించాల్సి ఉందని సాకి పేర్కొన్నారు. త్వరితగతిన భారత్​కు టీకాలు పంపించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

75 లక్షల డోసులు మాత్రమే..

ఇప్పటివరకు భారత్​కు 75 లక్షల టీకా డోసులు అమెరికా అందించినట్లు భారతీయ అమెరికన్​ కాంగ్రెస్​ సభ్యుడు రాజా క్రిష్ణమూర్తి తెలిపారు.అయితే.. భారత్​కు మరిన్ని టీకాలు పంపించాలని బైడెన్ బృందాన్ని అభ్యర్థించారు. శ్వేతసౌధం ప్రకటన నేపథ్యంలో క్రిష్ణమూర్తి వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

"అధ్యక్షుడు బైడెన్, చట్టసభ మిత్రులను మరోసారి కోరుతున్నా.. నొవిడ్ యాక్ట్​ను అమలు చేసి మహమ్మారిని అంతం చేసేందుకు కృషి చేయాలి. చాలా దేశాలు వ్యాక్సిన్లు సరిపడా లేక, కొత్త కొవిడ్​ వేరియంట్​ వ్యాప్తితో బాధపడుతున్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరకొస్తోంది. భారత్​కు కొవిడ్​ నుంచి కూడా స్వాతంత్య్రం రావాలి. అందుకోసం అమెరికా టీకాలు సాయం చేయాలి" అని క్రిష్ణమూర్తి కోరారు.

ఇదీ చదవండి:గ్రీన్​ కార్డు పొందే అర్హత కోల్పోనున్న లక్ష మంది!

Last Updated : Aug 7, 2021, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.