ETV Bharat / international

జంట యాంటీబాడీలతో కొత్త వేరియంట్లకు చెక్​ - కరోనా కొత్త వేరియంట్లపై శాస్త్రవేత్తలు

యాంటీబాడీ కాక్​టెయిల్​తో కొవిడ్​ కొత్త వేరియంట్లను కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. రెండు రకాల యాంటీబాడీలతో కూడిన కొన్ని మిశ్రమాలు అనేక వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది.

antibodies cocktail covid new variant
జంట యాంటీబాడీలతో కొత్త వేరియంట్లకు చెక్​
author img

By

Published : Jun 23, 2021, 6:54 AM IST

కరోనా కొత్త వేరియంట్లను యాంటీబాడీ కాక్​టెయిల్​తో కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు భిన్నరకాల యాంటీబాడీలతో కూడిన ఈ మిశ్రమం.. సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. మానవ రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం కొన్నిసార్లు ఆలస్యమవుతుంది. దీన్ని అధిగమించడానికి కృత్రిమంగా రూపొందిన మోనోక్లోనల్​ యాంటీబాడీలను రోగులకు ఇస్తున్నారు.

అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్ పరిశోధకులు.. ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అత్యవసర వినియోగ అనుమతిని పొందిన యాంటీబాడీ థెరపీలను విడివిడిగాను, కలిపి మిశ్రమాల రూపంలోనూ పరీక్షించారు. కరోనాతో కొత్తగా వచ్చిన అల్ఫా, బీటా, గామాలతోపాటు భారత్​లో మొదట వెలుగు చూసిన డెల్టా రకాన్ని పోలిన ఒక వేరియంట్​పై వాటిని ప్రయోగించారు. రెండు రకాల యాంటీబాడీలతో కూడిన కొన్ని మిశ్రమాలు అనేక వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా వెల్లడైంది.

ఇదీ చదవండి : Covid Vaccine: 'ప్రపంచానికి 5.5 కోట్ల డోసులిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.