ETV Bharat / international

COVID: ఈ ఔషధంతో కొత్త వేరియంట్లకూ చెక్!

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో బహుళ వేరియంట్లను సైతం సమర్థంగా నిరోధించే ఔషధాన్ని గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు. రోగనిరోధక వ్యవస్థను ముందుగానే అలర్ట్​ చేసి.. వైరస్​ను అడ్డుకునేలా చేస్తుందని తెలిపారు.

Corona virus
కరోనా వైరస్​
author img

By

Published : May 31, 2021, 3:50 PM IST

కరోనా మహమ్మారి(CORONA VIRUS) ఉత్పరివర్తనం చెందుతూ యావత్​ ప్రపంచాన్ని వణికిస్తోంది. వివిధ రకాల వేరియంట్లతో ఏ ఔషధం పనిచేస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తీవ్రమైన కొవిడ్-19(COVID-19)ను నిరోధించే అత్యంత సమర్థమైన ఔషధాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ డ్రగ్​.. శ్వాసకోశాలపై ప్రభావం చూపుతోన్న ఇతర కరోనా వేరియంట్ల(Corona variants)ను సైతం అడ్డుకుంటున్నట్లు నిర్ధరించారు. సార్స్​-కోవ్​-2 బారినపడి తీవ్రంగా ప్రభావితమైన ఎలుకలపై పరిశోధన చేసి తేల్చారు.

ఈ డ్రగ్​పై చేసిన అధ్యయనం జర్నల్​ సైన్స్​ ఇమ్యూనోలజీలో ప్రచురితమైంది. ఆ ఔషధమే డి-ఏబీజెడ్​ఐ. శరీరంలోని సహజమైన రోగనిరోధక వ్యవస్థను మేల్కొలిపి.. వైరస్​పై స్పందించేలా చేస్తోందని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.

" రోగనిరోధక ప్రతిస్పందనను ఒకే మోతాదుతో మేల్కొలపటం.. వైరస్​ను నియంత్రించటానికి మంచి వ్యూహమని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన దక్షిణాఫ్రికా రకం వైరస్​ బి.1.351పైనా ఇది ప్రభావవంతంగా పనిచేస్తోంది. సార్స్​-కోవ్​-2 వ్యాప్తిని అడ్డుకునేందుకు సమర్థమైన యాంటీవైరల్స్​ను అభివృద్ధి చేయటం ప్రస్తుతం అత్యవసరం. ముఖ్యంగా ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకొస్తున్న ఈ సమయంలో చాలా అవసరం."

- సారా చెర్రి, పెన్సిల్వేనియా వర్సిటి ప్రొఫెసర్​

సార్స్​-కోవ్​-2 సోకిన మానవ ఊపిరితిత్తుల కణాలను పరిశీలించటం ద్వారా పరిశోధకులు తొలుత వైరస్​ ప్రభావాన్ని బాగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. వైరస్​లు దాగి ఉండగలవని, రోగనిరోధక వ్యవస్థ ముందుగా గుర్తించి, స్పందించటంలో ఆలస్యం అయ్యేలా చేయగలుగుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే కొవిడ్​ను ముందుగానే గుర్తించి నిరోధించేందుకు రోగనిరోధక వ్యవస్థను అలర్ట్​ చేసే ఔషధాన్ని గుర్తించొచ్చని అంచనాకు వచ్చారు. ఇందుకోసం ఊపిరితిత్తుల కణాలను ఉత్తేజితం చేసే 75 ఔషధాలను పరిశీలించారు. అందులో 9 డ్రగ్స్​ సమర్థంగా ఉన్నట్లు గుర్తించారు. కొత్తగా అభివృద్ధి చేసిన డ్రగ్​ డీ-ఏబీజెడ్​ఐని పరీక్షించారు. ప్రస్తుతం ఈ ఔషధం కేన్సర్​ చికిత్స కోసం క్లినికల్​ ట్రయల్స్​లో ఉంది.

ఇదీ చూడండి: ఇలా అయితే.. కొవిడ్‌-26, కొవిడ్‌-32 తప్పవు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.