ETV Bharat / international

'మాస్క్‌పై మాస్క్‌తో ప్రయోజనమెక్కువ' - డబుల్ మాస్కింగ్ న్యూస్

మాస్కుపై మాస్కు ధరించడం వల్ల కరోనా వైరస్​ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. ఇదే అభిప్రాయాన్ని కొద్దిరోజుల క్రితం ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ సైతం వ్యక్తం చేశారు. మొదటి మాస్క్‌తో అక్కడక్కడా ఏవైనా ఖాళీలు మిగిలిపోతే, రెండో మాస్క్‌ వాటిని పూరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

double-masking-makes-common-sense-fauci-says-usage-of-double-mask
'మాస్క్‌పై మాస్క్‌తో ప్రయోజనమెక్కువ'
author img

By

Published : Jan 29, 2021, 5:55 AM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కులు కీలక పాత్ర పోషిస్తాయని మొదటి నుంచి వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. కాగా, మాస్క్‌పై మాస్క్‌ ధరించడం వల్ల ఈ వైరస్‌ నుంచి మరింత రక్షణ లభిస్తుందని అమెరికా అంటువ్యాధులు నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. ఈ విధానాన్ని డబుల్ మాస్కింగ్ అంటారు.

"మీరు అప్పటికే ఒక మాస్కుతో ముఖాన్ని కప్పి ఉంచితే..దానిపై ఇంకో లేయర్ ఉండేలా చూసుకోండి. అది మరింత బాగా పనిచేయనుంది" అని ఫౌచీ ఓ షోలో భాగంగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు వెలుగుచూస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ కొత్త రకాలకు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొదటి మాస్క్‌తో అక్కడక్కడా ఏవైనా ఖాళీలు మిగిలిపోతే, రెండో మాస్క్‌ వాటిని పూరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ విధానం వల్ల శ్వాసించేప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగదని కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ‘ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే వైరస్‌ వల్ల పాజిటివ్‌ రేటు మరింత పెరగనుంది. భౌతిక దూరం పాటించడం, ప్రయాణాలు తగ్గించడం, మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. అయితే మాస్కుల్లో నాణ్యత తప్పనిసరి’ అని మరొకరు వివరించారు.

ప్రమాదం పొంచి ఉన్న దగ్గరే

వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న దగ్గర ఈ రెండు మాస్కులతో అవసరం ఉంది. బయట ప్రదేశాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉన్న దగ్గర వాటి వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. మిగతాప్పుడు ఒక మాస్కు సరిపోతుందని వారు తెలిపారు. సర్జికల్, క్లాత్‌ మాస్క్‌ను కలిపిధరించడం వల్ల ఉపయోగం ఉంటుందన్నారు. కరోనా టీకాల సామర్థ్యంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతున్నందున.. రెండు మాస్కులు ధరించడమే మనముందు ఉన్న మంచి అవకాశమని కొద్ది రోజుల క్రితం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.