ETV Bharat / international

జిన్​పింగ్​​తో మాట్లాడాలనుకోవట్లేదు: ట్రంప్​ - Trump latest news update

ప్రస్తుత సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​తో మాట్లాడదలుచుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అన్నారు​. కరోనా కట్టడిలో నాయకత్వం వహించాలనుకుంటున్న చైనాపై తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. వాణిజ్య ఒప్పందంపై తాము సంతోషంగా లేమని.. కరోనా వైరస్​ చైనా నుంచే వచ్చిందని పునరుద్ఘాటించారు.

Don't want to talk to Xi Jinping right now: Trump
చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​​తో మాట్లాడాలనుకోవట్లేదు: ట్రంప్​
author img

By

Published : May 16, 2020, 11:38 AM IST

కరోనా మహమ్మారి విజృంభణకు చైనానే కారణమని కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. తాజాగా మరోమారు చైనాపై తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. ప్రస్తుత సమయంలో ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్​పింగ్​తో మాట్లాడాలనుకోవట్లేదని స్పష్టం చేశారు.

" ప్రస్తుతం ఆయన (జిన్​పింగ్​)తో మాట్లాడాలనుకోవట్లేదు. ముందు ముందు ఏమి జరుగుతుందో చూద్దాం. వాణిజ్య ఒప్పందంపై వారు చాలా ఖర్చు చేస్తున్నారు."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

అంతకుముందు చైనాతో వాణిజ్యం ఒప్పందంపై మాట్లాడదలుచుకోలేదని పేర్కొన్నారు ట్రంప్​. అమెరికా ఉత్పత్తులను చైనా భారీగా కొనుగోలు చేస్తోందన్నారు. కరోనా వైరస్​ చైనా నుంచే వచ్చిందని, ఇతర దేశాలకు సంక్రమించకముందే దానిని అరికట్టాల్సిందని పునరుద్ఘాటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.