ETV Bharat / international

సమాచార మాధ్యమాన్ని ప్రారంభించిన ట్రంప్ - అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

'ఫ్రమ్​ ది డెస్క్​ ఆఫ్​ డొనాల్డ్​ జే ట్రంప్'​ పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్​ ప్లాట్​ఫార్మ్​ను ప్రారంభించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ప్లాట్​ఫార్మ్​ సామాజిక మాధ్యమం కాదని ఆయన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ మాధ్యమంలో ట్రంప్​ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన చేసిన ప్రకటనలను పొందుపరిచారు.

trump launches communications platform, america ex president donald trump
అమెరికా మాజీ అధ్యుడు ట్రంప్
author img

By

Published : May 5, 2021, 9:35 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్..​ నూతన సమాచార మాధ్యమాన్ని మంగళవారం ప్రారంభించారు. 'ఫ్రమ్​ ది డెస్క్​ ఆఫ్​ డొనాల్డ్​ జే ట్రంప్'​ పేరుతో ఉన్న ఈ మాధ్యమం​ ప్రస్తుతం ట్రంప్​ అధికారిక వెబ్​సైట్​లో ఓ భాగం. ఈ దీని​ ద్వారా ట్రంప్​కు సంబంధించిన తాజా ప్రకటనలు, ఆయన హయాంలోని ప్రత్యేకతలను పేర్కొంటామని ఆయన కార్యదర్శి జేసన్​ మిల్లర్​ వెల్లడించారు.

ఇది సోషల్​ మీడియా కాదు..

ట్రంప్​ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్లాట్​ఫార్మ్​ సామాజిక మాధ్యమం కాదని మిల్లర్​ స్పష్టం చేశారు. ఈ మాధ్యమానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆ మాధ్యమంలో 30 సెకన్ల నిడివిగల ఓ వీడియోను పోస్ట్​ చేశారు. ట్రంప్​ సామాజిక మాధ్యమాల ఖాతాల నిషేధానికి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ ఆ వీడియోను తీర్చిదిద్దారు.

ఈ మాధ్యమంలో ట్రంప్​ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన చేసిన ప్రకటనలను పొందుపరిచారు.

ఇదీ చదవండి : భారత​ ప్రయాణికులపై అమెరికా నిషేధం అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.