అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్‌లు ట్విట్టర్ వేదికగా పరస్పరం వ్యంగ్యాస్త్రాలు విసురుకున్నారు. 2020 అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు హారిస్ ప్రకటించడం ఇందుకు కారణమైంది.
అసలేమైందంటే..
55 ఏళ్ల కమలా హారిస్ డెమెక్రటిక్ అభ్యర్థిగా 2020 అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఇందుకు ఆర్థిక పరిస్థితులు కారణంగా పేర్కొన్నారు.
నాటో సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ వెల్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్ ద్వారా స్పందించారు.
'చాలా బాధాకరం. మేము మిమ్మల్ని దూరమవుతాము కమలా!' అంటూ ట్వీట్ చేశారు
ట్రంప్‌కు దీటుగా బదులిచ్చారు సెనేటర్ కమలా. "బాధ పడకండి ప్రెసిడెంట్.. నేను మిమ్మల్ని..మీ అభిశంసన తీర్మాన విచారణలో కలుస్తాను." అంటూ ట్వీట్ చేశారు.
ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలున్నాయని డెమొక్రాట్లు చెబుతున్నారు. నిరాధార ఆరోపణలని శ్వేతసౌధం వీటిని కొట్టిపారెస్తోంది.
ఇదీ చూడండి:ట్రంప్ గ్రీన్‌సిగ్నల్.. తాలిబన్లతో చర్చలకు అమెరికా సిద్ధం..!