ETV Bharat / international

ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల ట్రంప్​ సంతాపం - Pranab Mukherjee condolence

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ప్రణబ్​ కుటుంబ సభ్యులు, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Donald Trump condoles
ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల డొనాల్డ్​ ట్రంప్ విచారం
author img

By

Published : Sep 2, 2020, 5:07 AM IST

Updated : Sep 2, 2020, 6:15 AM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో. ముఖర్జీని గొప్పనేతగా అభివర్ణించారు. ప్రణబ్​ దూరదృష్టి నాయకత్వం భారత్..​ ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు సాయపడిందని పేర్కొన్నారు. అదే అమెరికా-భారత్​ దృఢమైన బందానికి పునాది వేసిందని గుర్తు చేసుకున్నారు​.

''భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మరణ వార్తతో దిగ్ర్భాంతికి గురయ్యా. ఆయన కుటుంబ సభ్యులు, భారత ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి.''

- డొనాల్డ్​ ట్రంప్​,అమెరికా అధ్యక్షుడు

అంతకు ముందు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో సంతాపం ప్రకటించారు. ప్రణబ్​ మృతిపట్ల అగ్రరాజ్యం విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒక పార్లమెంటేరియన్​గా, కేబినెట్​ మంత్రిగా, ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా భారత ప్రజల కోసం నిస్వార్థంగా పని చేశారని కొనియాడారు పాంపియో.

ఇదీ చూడండి: ప్రణబ్​ మృతిపట్ల ప్రపంచ దేశాల సంతాపం

Last Updated : Sep 2, 2020, 6:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.