ETV Bharat / international

'ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో ఆధిపత్య పోరు' - మార్క్​ ఎస్పర్​ న్యూస్​

భారత్​-చైనాల మధ్య ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నాలను అమెరికా ప్రోత్సహిస్తుందని తెలిపారు ఆ దేశ రక్షణ మంత్రి మార్క్​ ఎస్పర్​. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆధిపత్య పోరుకు కేంద్రంగా మారిందని, అంతర్జాతీయంగా తన అధికారం చూపేందుకు చైనా ప్రయత్నిస్తోందన్నారు. ఈ సమయంలో భారత్ వంటి భాగస్వామ్య దేశాలతో అమెరికా తన బంధాలను బలోపేతం చేస్తోందన్నారు.

Dominance struggle in the Indo-Pacific region
'ఇండో-ఫసిఫిక్​ ప్రాంతంలో ఆధిపత్య పోరు'
author img

By

Published : Aug 28, 2020, 7:42 AM IST

ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆధిపత్య పోరుకు కేంద్రంగా మారిందని, అంతర్జాతీయంగా తన అధికారం చూపేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్​ చెప్పారు. అంతర్జాతీయ నియమాలకు డ్రాగన్ లోబడే పరిస్థితులను కల్పించేందుకు.. భారత్ వంటి భాగస్వామ్య దేశాలతో అమెరికా తన బంధాలను బలోపేతం చేస్తోందన్నారు. ఈ మేరకు ఆయన హవాయిలోని 'డేనియల్​ కె ఇనోయి ఆసియా-పసిఫిక్ సెంటర్​ ఫర్​ సెక్యూరిటీ స్టడీస్'లో బుధవారం కీలకోపాన్యాసం చేశారు.

"భారత్​-చైనాల మధ్య ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నాలను అమెరికా ప్రోత్సహిస్తుంది. నిజానికి అధికార చైనా కమ్యూనిస్ట్​ పార్టీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఆ దేశ సైన్యం దూకుడుగా వెళ్తోంది. ఈ శతాబ్ద మధ్యకాలం నాటికి ప్రపంచ స్థాయి సైనిక ప్రమాణాలను అందుకోవడమే దాని లక్ష్యం. చిన్న దేశాల కష్టాలను ఆసరగా చేసుకుని ఆర్థిక సాయం అదించడం, తర్వాత వాటిని ఒత్తిళ్లకు గురిచేయడం చైనాకు పరిపాటిగా మారింది. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో ఆ దేశం ప్రాదేశిక వివాదాలను రెచ్చగొడుతోంది. సైన్యం దూకుడుగా వెళ్లేందుకు దన్నుగా నిలుస్తోంది. ఆఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా అనేక యాక్సెస్​ పాయింట్ల వద్ద తన భద్రతా దళాలను మోహరించడం ద్వారా.. విశ్వవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు డ్రాగన్​ దేశం ప్రయత్నిస్తోంది. అయితే ఆగ్నేయ దక్షిణాసియా ప్రాంతాల్లో అమెరికా తన బలాన్ని పెంచుకునేందుకు పలు దేశాలతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారత్​తో సంబంధాలను ముందుకు తీసుకెళ్లాం. రక్షణ భాగస్వామ్యాన్ని పెంపొందించాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చడానికి, అంతరాయాలు సృష్టించడానికి, అణచివేతకు పాల్పడటానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా దాని మిత్రదేశాలు నిర్మాణాత్మకంగా తిప్పికొడుతున్నాయి. ట్రంప్ సర్కారు ఇండో-పసిఫిక్​ వ్యూహాన్ని అమలు చేయడానికి మిత్ర దేశాలు సహకారం అందించాలి."

-మార్క్ ఎస్పర్​, అమెరికా రక్షణ మంత్రి

ఇదీ చూడండి: రష్యా టీకా బేషుగ్గా పనిచేస్తోంది: పుతిన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.