ETV Bharat / international

కరోనాను పసిగట్టేందుకు శునకాలకు ప్రత్యేక శిక్షణ! - Dogs are training to detect Corona

శునకాల ద్వారా కరోనాను పసిగట్టొచ్చంటున్నారు నిపుణులు. ఈ మేరకు అమెరికా, బ్రిటన్​లో ఇప్పటికే కుక్కలకు శిక్షణ కూడా ఇస్తున్నారని.. వాటికి వైరస్ వాసనను పరిగట్టగలిగే సామర్థ్యం ఉందో లేదో తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారని 'ది వాషింగ్టన్​ పోస్ట్'​ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

Dogs are being trained to sniff out COVID-19
కరోనాను పసిగట్టేందుకు శునకాలకు ప్రత్యేక శిక్షణ!
author img

By

Published : Apr 30, 2020, 2:20 PM IST

Updated : Apr 30, 2020, 3:03 PM IST

ప్రస్తుతం మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారిని ఎలా కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు తర్జనభర్జన పడుతున్నాయి. వ్యాక్సిన్​ కోసం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే శునకాల ద్వారా కరోనాను పసిగట్టొచ్చంటున్నారు నిపుణులు. ఈ మేరకు అమెరికా, బ్రిటన్​లో ఇప్పటికే కుక్కలకు శిక్షణ కూడా ఇస్తున్నారని.. వాటికి వైరస్ వాసనను పసిగట్టగలిగే సామర్థ్యం ఉందో లేదో తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారని 'ది వాషింగ్టన్​ పోస్ట్'​ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. యూనివర్సిటీ ఆఫ్​ పెన్సిల్వేనియాలో లాబ్రాడర్​ రిట్రీవర్స్​కు చెందిన ఎనిమిది కుక్కలపై పరిశోధనలు జరుగుతున్నట్లు పేర్కొంది.

గంటకు 250 మంది స్క్రీనింగ్​

లండన్​ స్కూల్​ ఆఫ్​ హైజీన్​ అండ్​ ట్రోపికల్​ మెడిసిన్​లోనూ ఇలాంటి పరిశోధనలే జరుగుతున్నాయని తెలిపింది వాషింగ్టన్​ పోస్ట్​. మానవుల్లో మలేరియా ఇన్ఫెక్షన్లను కుక్కలు పసిగట్టగలవని లండన్​ స్కూల్​ ఆఫ్​ హైజీన్​ శాస్త్రవేత్తలు గతంలో ధ్రువీకరించారు. ఇప్పుడు కరోనాపై దృష్టి సారించారు. ఒకవేళ కుక్కలు కరోనాను పసిగట్టగలిగితే.. విమానాశ్రయాలు, ఆసుపత్రులు, ఇతర వ్యాపార ప్రాంతాల్లో ప్రజలను స్క్రీనింగ్​ చేసేందుకు వీటిని వినియోగించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

శునకాలు ఇప్పటికే.. పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, నిషేధిత ఆహార పదార్థాలతో పాటు మలేరియా, క్యాన్సర్​ను కూడా పసిగడుతున్నందున.. కరోనాను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఒక్కో వైరస్​కు ప్రత్యేక వాసన కూడా ఉంటుందని వెల్లడించారు.

" వైరస్​ వాసన కచ్చితంగా ఇదే అని మాకు తెలీదు. అయితే శునకాలు వైరస్​ వాసన ఏమిటి అనే విషయాన్ని పట్టించుకోవు. ఇతర వాటితో పోలిస్తే ఈ శాంపిల్స్​ వాసన వేరుగా ఉందనేది పసిగట్టడం నేర్చుకుంటాయి."

- ఎం. ఓట్టో, పెన్సిల్వేనియా​ స్కూల్​ ఆఫ్​ వెటర్నరీ మెడిసిన్​ డాగ్​ సెంటర్​ డైరెక్టర్​

ఒక్కో కుక్క గంటకు 250 మందిని స్క్రీనింగ్​ చేయగలదని అంటున్నారు లండన్​ శాస్త్రవేత్తలు. అలాగే భవిష్యత్​లో కొవిడ్​-19 పాజిటివ్​, నెగటివ్​ వచ్చిన రోగుల మూత్రం, లాలాజలం శాంపిల్స్ సేకరించి.. శునకాలకు శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు.

Last Updated : Apr 30, 2020, 3:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.