కరోనా సంక్షోభం కారణంగా 'వాల్ట్ డిస్నీ వరల్డ్' కీలక నిర్ణయం తీసుకుంది. థీమ్ పార్క్ సంస్థలో పనిచేసే దాదాపు 32వేల మంది ఉద్యోగులకు లే ఆఫ్ ఇవ్వనున్నట్లు గురువారం వెల్లడించింది. ఇదివరకు 28వేల మందికి లేఆఫ్ ప్రకటించాలని భావించినా ప్రస్తుతం ఆ సంఖ్యను 32 వేలకు పెంచింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు సంస్థ పేర్కొంది.
దీంతోపాటు సినిమారంగంలో పెట్టుబడులను సైతం తగ్గించుకోనున్నట్లు డిస్నీ సంస్థ తెలిపింది. వాల్ట్ డిస్నీకి ప్రస్తుతం అమెరికాలో రెండు థీమ్ పార్కులు ఉన్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలో ఒకటి. ఫ్లోరిడాలో మరొకటి.