అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి తన స్వస్థలం డెలావేర్లోని విల్మింగ్టన్లో ఓటేశారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తరహాలోనే ముందస్తుగా తన ఓటును నమోదు చేశారు.
ఓటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన బైడెన్.. ఎన్నికల్లో గెలిస్తే రిపబ్లికన్లతోనూ కలిసి పనిచేస్తానని చెప్పారు. వైద్య సంరక్షణకు సంబంధించి తన ప్రణాళికలను వివరించారు. ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన వైద్య చట్టాన్ని మరింత మెరుగుపర్చేదిశగా ప్రయత్నించనున్నట్లు తెలిపారు.