ETV Bharat / international

అధ్యక్ష రేసులో ట్రంప్​కు పోటీగా నిలబడేది వారేనా? - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మార్చి 3వ తేదీ కీలకం కానుంది. లక్షల మంది ప్రజలు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు పోటీగా డెమోక్రాట్స్​ తరఫున ఎవరు బరిలో ఉండనున్నారో తెలియనుంది.

Democratic presidential race reduced to triangular contest ahead of 'Super Tuesday'
అధ్యక్ష రేసులో ట్రంప్​కు పోటీగా నిలబడేది వారేనా?
author img

By

Published : Mar 3, 2020, 5:57 AM IST

ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు పోటీగా నిలబడే డెమోక్రాట్​ అభ్యర్థిపై ఈ మంగళవారం తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే దేశంలోని 50 రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్చి 3న 14 రాష్ట్రాల్లో లక్షలమంది అమెరికన్లు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. డెమోక్రాట్​ పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు బెర్నీ సాండర్స్, జో బిడెన్, మైఖెల్​ బ్లూమ్​బర్గ్ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.​ ఈ మంగళవారమే ప్రజలకు, నాయకులకు కీలకం కానుంది.

ఒకవేళ అన్ని అడ్డంకులను ఎదుర్కొని నిలబడితే ఎలిజబెత్​ వైరస్​, అమీ కోబుచార్​లకు కూడా డెమోక్రాట్​ తరఫున అభ్యర్థిగా బరిలో నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్​ ముగిశాక.. ఓట్లను లెక్కించేందుకు రాత్రంతా పట్టొచ్చని అధికారులు తెలిపారు.

ఎవరు వీరంతా?

బ్లూమ్​బర్గ్ ప్రస్తుతం​ న్యూయార్క్​ మేయర్​గా ఉన్నారు. అధ్యక్ష బరిలోకి ఆలస్యంగా అడుగుపెట్టారు. 78 ఏళ్ల ఈ బిలియనీర్​.. అమెరికాలో వ్యాపారవేత్త​, సామాజిక వేత్త. ఈ ఎన్నికల్లో గెలిచే గెలవాలని ప్రటనల కోసం మిలియన్​ డాలర్లను వెచ్చించారు. బ్లూమ్​బర్గ్ తొలిసారి అధ్యక్ష బరిలో ఉన్నారు.

సెనేటర్​ సాండర్స్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక బిడెన్​ మూడోమారు తన బలాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. బిడెన్​ గతంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ​

ఇదీ చూడండి: నిర్భయ దోషుల ఉరిపై వీడని ఉత్కంఠ.. మరోమారు స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.