ETV Bharat / international

'ట్రంప్​.. భారత్​ గురించి మాట్లాడే తీరు ఇదేనా?' - ట్రంప్​ ఇండియా వాయుకాలుష్యం

వాయు కాలుష్యం నేపథ్యంలో భారత్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలను డెమోక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ తప్పుబట్టారు. భారత్​ వంటి మిత్ర దేశం గురించి మాట్లాడే తీరు ఇది కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే భారత్​తో మైత్రికి అత్యంత విలువిస్తామని స్పష్టం చేశారు.

Deeply value friendship with India: Biden
'ట్రంప్​.. భారత్​తో మాట్లేడే తీరు ఇది కాదు'
author img

By

Published : Oct 25, 2020, 8:38 AM IST

భారత్​లో వాయుకాలుష్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలను ఖండించారు డెమోక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​. తాను, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​.. భారత్​తో మైత్రికి అత్యంత విలువనిస్తామన్నారు.

"భారత్​ను అధ్యక్షుడు ట్రంప్​ ఓ మురికి దేశంగా అభివర్ణించారు. మిత్ర దేశం గురించి మాట్లాడే తీరు ఇది కాదు. వాతావరణ మార్పు వంటి సమస్యను పరిష్కరించే విధానం ఇది కాదు. కమల, నేను భారత్​తో బంధానికి ఎంతో విలువనిస్తాం. విదేశీ విధానాల్లో భారత్​కు గౌరవం దక్కే విధంగా చర్యలు చేపడతాం."

--- జో బైడెన్​, డెమోక్రటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి.

అధ్యక్ష పోరులో శుక్రవారం జరిగిన చివరి సంవాదంలో భాగంగా.. భారత్​, చైనా, రష్యా దేశాలు వాయు కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు ట్రంప్​.

'నేను గెలిస్తే..'

తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్​తో మైత్రిని మరింత దృఢపరిచేందుకు చర్యలు చేపడతానన్నారు బైడెన్​. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడతామని, శాంతిని ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అమెరికా- భారత్​లోని మధ్య తరగతి వారు ఎదిగేలా కృషి చేస్తానని హామీనిచ్చారు.

ఇదీ చూడండి:- ట్రంప్​Xబైడెన్​​: చర్చంతా కరోనాపైనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.