ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్పైనే అశాలుపెట్టుకున్నాయి. ఎప్పుడు ఎవరు శుభవార్తను చెబుతారా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. అనేక దేశాల్లో జరుగుతున్న పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయి. వీటికి సంబంధించి సంచలనాత్మక ప్రకటనలు ఎప్పుడైనా బయటకు రావచ్చు. అయితే వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడం ఒక ఎత్తు.. దాన్ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడం ఇంకో ఎత్తు. మరి అసలు తొలుత వ్యాక్సిన్ ఎవరికి అందుతుంది?
కష్టమైన ప్రశ్నే...
వ్యాక్సిన్ పంపిణీకి అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు చేయాలని అమెరికా ప్రభుత్వం సలహా బృందాలను కోరింది. అయితే వచ్చే నెల చివరి నాటికి ఈ విషయంపై మార్గదర్శకాలు వెలువడతాయని అగ్రరాజ్య అరోగ్య అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది చాలా కష్టమైన వ్యవహారమని చెబుతున్నారు.
"వ్యాక్సిన్ అందాల్సిన జాబితాలో తామే మొదటి స్థానంలో ఉండాలని అనేక మంది భావిస్తారు. అందుకని ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ నచ్చకపోవచ్చు."
-- డా. ఫ్రాన్సిస్ కాలిన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరక్టర్.
ఆరోగ్య సిబ్బందికి, వైరస్ తీవ్రత అత్యంత ఉద్ధృతంగా ఉన్న ప్రాంతాల వారికి తొలుత వ్యాక్సిన్ను అందించడం సంప్రదాయం. అయితే ఈ సంప్రదాయాన్ని ఈసారి అనేక కారణాలు ప్రభావితం చేయవచ్చని కాలిన్స్ అభిప్రాయపడ్డారు. భౌగోళికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని, కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్లో పాల్గొంటున్న వలంటీర్లలో డమ్మీ టీకా ప్రయోగించిన వారినీ విస్మరించకూడదని తెలిపారు కాలిన్స్.
ఇదీ చూడండి:- 'కరోనా టీకా.. మాకే ముందుగా'- పంపిణీ సవాలే!
వ్యాక్సిన్ సురక్షితమైనదే అని ఈ ఏడాది చివరి నాటికి రుజువైనప్పటికీ.. అందరికీ తక్షణమే సరఫరా చేయడానికి వీలుండదు. ముఖ్యంగా అనేక వ్యాక్సిన్లు పనిచేయాలంటే రెండు డోసులు వేయడం అవసరం.
ఈ విషయంపై అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం.. 'తొలుత వ్యాక్సిన్ ఎవరికి అందివ్వాలి?' అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతికేందుకు సతమతమవుతోంది. పేద దేశాలకు వ్యాక్సిన్ను అందివ్వాలని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడుతున్నప్పటికీ.. ధనిక దేశాలు తమకే దక్కాలని పట్టుబడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటన్నింటినీ అధిగమించి... టీకా పంపిణీకి హేతుబద్ధమైన వ్యూహం రూపొందించడం ప్రపంచ దేశాల ముందున్న అసలు సవాలు.
ఇవీ చూడండి-