ETV Bharat / international

'ఫ్లాయిడ్' నిరసన సెగ.. ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం - anti-racism demonstrations latest news

అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. న్యాయం కావాలంటూ.. విగ్రహాల ధ్వంసకాండ కొనసాగుతోంది. తాజాగా వాషింగ్టన్​లోని కాన్ఫెడరేట్ జనరల్ ప్రతిమ, శాన్​ఫ్రాన్సిస్కోలోని స్కాట్ కీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు నిరసనకారులు.

statue of Confederate general
'ఫ్లాయిడ్' నిరసన సెగ.. ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం
author img

By

Published : Jun 21, 2020, 8:58 AM IST

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతితో చెలరేగిన జాత్యహంకార వ్యతిరేక నిరనసల్లో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. అగ్రరాజ్యంలో నల్లజాతీయులకు విముక్తి లభించిన రోజు 'జూనెటీన్త్' సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనల్లో భాగంగా.. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో కాన్ఫెడరేట్ జనరల్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

statue of Confederate general
కాన్ఫెడరేట్​ జనరల్​ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులు

వాషింగ్టన్​లో ఉన్న 11 అడుగుల ఎత్తైన కాన్ఫెడెరేట్ జనరల్ ఆల్బర్ట్ పైక్ విగ్రహాన్ని గొలుసులతో లాగి చెత్తకుప్పల్లో పడేశారు. అనంతరం నిప్పుపెట్టి దాని చుట్టు వలయాకారంలో నిలుబడి నినాదాలు చేశారు. 'న్యాయం లేకపోతే.. శాంతి లేదు', 'జాత్యహంకార పోలీసులు వద్దు' అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆ సమయంలో పోలీసులు ఉన్నా.. విగ్రహ ధ్వంసాన్ని ఆపకుండా మిన్నుకుండిపోయారు. ఈ దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన అధ్యక్షుడు ట్రంప్.. పోలీసులు ఉన్నా ఎందుకు ఆపలేకపోయారు.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నగర మేయర్​కు లేఖ రాశారు.

statue of Confederate general
కాన్ఫెడరేట్​ జనరల్​ విగ్రహానికి నిప్పు

స్కాట్ కీ విగ్రహం..

శాన్​ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ పార్క్​లో ఉన్న అమెరికా జాతీయ గీత రచయిత.. ఫ్రాన్సిస్ స్కాట్ కీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఆందోళనకారులు.

statue of Confederate general
ఫ్రాన్సిస్ స్కాట్ కీ విగ్రహం

గాంధీ విగ్రహాన్ని రక్షించుకుంటాం..

జాత్యహంకార వ్యతిరేక నిరసన జ్వాలలు బ్రిటన్​లోనూ ఉద్ధృతంగా సాగుతున్నాయి. యూకేలోని పలు నగరాల్లో విగ్రహాల ధ్వంసం కొనసాగుతున్న వేళ.. ఇంగ్లాండ్​లోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు లీసెస్టర్ నగర మేయర్. మహాత్ముడి విగ్రహానికి నిరసనకారుల నుంచి ముంపు పొంచి ఉందన్న నేపథ్యంలో.. విగ్రహాన్ని రక్షించాలని ఆన్​లైన్​ వేదికగా 6 వేల మంది పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ చూడండి: 'కొలంబస్'కు నిరసన సెగ- విగ్రహం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.