ETV Bharat / international

పోలీస్​ టెక్నిక్​లే ప్రమాదం.. అవే మరణాలకు కారణం! - ఊపిరి

జార్జి ఫ్లాయిడ్​.. మినియాపొలిస్​ పోలీస్​ అధికారి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేయగా బలైన ఆఫ్రికన్​ అమెరికన్​. అయితే.. ఇలా చేయడం ఒకటో, రెండో దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అరెస్టు, విచారణల సందర్భంగా పోలీసులు వేర్వేరు టెక్నిక్​లను ఉపయోగిస్తుంటారు. కొన్ని సాధారణమే అయినా... మరికొన్ని దేశాల్లో ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ఈ పద్ధతే ఎందరినో ఊపిరాడక మరణించేలా చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

"Dangerous:" Around world, police chokeholds scrutinised
పోలీస్​ టెక్నిక్​లే ప్రమాదం.. అదే మరణాలకు కారణం!
author img

By

Published : Jun 3, 2020, 4:17 PM IST

పోలీసులంటే సమాజానికి రక్షకులు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుగా గుర్తొచ్చేది వారే. ప్రాణ రక్షణలో పోలీసులు అంతటి కీలక పాత్ర పోషిస్తున్నా... ప్రజల్లో వారి పట్ల సానుకూల దృక్పథం మాత్రం పెద్దగా లేదు. ముఖ్యంగా అనుమానితులను అరెస్టు చేసి, ప్రశ్నించే సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా పోలీసులు దీర్ఘకాలంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. బాధితుల్ని కదలనీయకుండా కిందపడేసి మోకాళ్లతో ఒత్తిపట్టి(ఫేస్​-డౌన్​ హోల్డ్స్​).. శ్వాస ఆడకుండా చేస్తుండటం దశాబ్దాలుగా సాగుతోంది. ఇప్పుడు అమెరికాలో జార్జ్​ ఫ్లాయిడ్​ మరణంతో.. పోలీసులు దర్యాప్తు చేసే తీరు మరోసారి చర్చనీయాంశమైంది.

అమెరికాలో నిరసనలను అదుపుచేస్తూ..

ఫ్లాయిడ్​ను విచారణలో భాగంగా ఊపిరాడకుండా చేసి బలిగొనడమే.. ప్రపంచవ్యాప్తంగా నిరసనకారుల ఆగ్రహావేశాలకు కారణం. ఇంకా పోలీస్​ కస్టడీల్లో మృతి చెందే అమెరికన్లలో నల్లజాతీయులే అధికం. ఇదే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడానికి దారితీసింది.

అయితే.. ఇదొక్క అమెరికాకే పరిమితమైన సమస్య కాదు. పలు దేశాల్లో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి.

ఫ్రాన్స్​లో..

''అమెరికా పరిస్థితులు మాకు సంబంధించినవి కాదు అని నేను అనలేను.''... ఇది ఫ్రెంచ్​ చట్టసభ్యుడు ఫ్రాంకోయిస్​ రఫిన్​ వ్యాఖ్య. ఫ్రాన్స్​లో ఎందరి మరణాలకో కారణమైన ఫేస్​-డౌన్​ హోల్డ్స్​ను నిషేధించాలని ఎప్పటినుంచో ఒత్తిడి తెస్తున్నారు రఫిన్​.

ఇటీవల ఫ్లాయిడ్​ మరణించిన 3 రోజులకే పారిస్​లో ఓ నల్లజాతీయుడిని అరెస్టు చేశారు. అతడినీ ఫ్లాయిడ్​ తరహాలోనే మెడ, దవడ, ఛాతిని నొక్కి, మోకాలిపై అదిమిపట్టిన వీడియో బహిర్గతమైంది. దీనిపైనా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే.. లైసెన్స్​ లేకుండా ఆల్కహాల్​, డ్రగ్స్​ను తరలిస్తున్నారన్న అనుమానంతో పట్టుకోబోతే ప్రతిఘటించాడని, పోలీసులను అవమానించాడని చెప్పి అధికారులు తప్పించుకున్నారు.

ఫ్రాన్స్​లో హింసాత్మకంగా ఆందోళనలు

హాంకాంగ్​లో..

కొన్ని నెలల క్రితం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటిన హాంకాంగ్​లో.. నిరసనకారుల పట్ల పోలీసుల తీరు వివాదాస్పదమైంది. అక్కడా ఓ వ్యక్తి వెనుకభాగం, భుజం, మెడను మోకాలి కింద పెట్టి హింసించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అతను చనిపోయాడు కూడా. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.

ఏ దేశాల్లో ఎలా...?

నిందితులు, అనుమానితులను ప్రశ్నించే, అరెస్టు చేసే విషయాల్లో.. పోలీసుల నియమాలు, పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా మారుతుంటాయి.

'నేను ఊపిరిపీల్చుకోలేకపోతున్నా' అని మొరపెట్టుకున్నా... చలనం లేని స్థితికొచ్చేవరకు మినియాపొలిస్​ పోలీస్​ అధికారి డెరెక్​ చావిన్​ ఫ్లాయిడ్​ను విడిచిపెట్టలేదు. ఇప్పుడు హత్య కేసులో నిందితుడు అయ్యాడు డెరెక్.

  • బెల్జియంలో వెన్నుపై మోకాలుతో అదిమిపడతారని.. పోలీసులకు శిక్షణ ఇచ్చే వ్యక్తి చెప్పడం విశేషం. అది కూడా ఊపిరి ఆడకుండా చేస్తుందని వివరించారాయన.
  • మెడపై ఒత్తిడి పెంచి శ్వాస ఆడకుండా చేయడం లాంటి ఎత్తుగడ, ప్రోటోకాల్​లాంటివేమీ లేవని ఇజ్రాయెల్​లోని పోలీస్​ ప్రతినిధి అంటున్నారు.
  • జర్మనీలో మెడపై కాకుండా.. తలపై కాస్త ఒత్తిడి పెంచే విధంగా అక్కడి పోలీసులకు అనుమతి ఉంది.
  • యూకేలో నిందితులు, అనుమానితులను మోకాళ్లపై కూర్చోబెట్టడం, ఎదురుగా నిలబెట్టడం వంటివే చేస్తారట. మెడపై ఒత్తిడి పెంచడం ప్రమాదకరమని, దానిని ప్రోత్సహించలేమని అధికారులు చెబుతున్నారు.
    లండన్​లో చేతులను వెనక్కిపెట్టి..

ఒకే దేశంలోనూ వేర్వేరుగా...

ఒకే దేశంలోనూ వేర్వేరు చోట్ల పోలీసుల టెక్నిక్​లు మారుతుంటాయి.

  • అమెరికాలోని న్యూయార్క్​లో మెడపై ఉడుంపట్టు పట్టడం, ఛాతిపై కూర్చొని, నిల్చొని ఒత్తిడి పెంచడం వంటివాటికి అనుమతి లేదు.
    న్యూయార్క్​లో కూర్చోబెట్టి..
  • ఫ్రాన్స్​లోని మిలిటరీ దళాలు కూడా దీనిని ప్రోత్సహించవట. అయినా దేశవ్యాప్తంగా పోలీసులకు స్వేచ్ఛ కల్పించినట్లు తెలుస్తోంది. కానీ.. ఒత్తిడి సాధ్యమైనంత తక్కువగా ఉండాలి అని 2015లో ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
  • నిందితులు ప్రతిఘటిస్తే.. ఫేస్​-డౌన్​ ఒక్కటే మార్గమని ఓ పోలీసు ఉన్నతాధికారి అంటున్నారు. ఫ్రాన్స్​లో అసలు సమస్య.. సరైన శిక్షణ, అవగాహన లేకపోవడమేనని చెప్పడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా పోలీసులు దాదాపు ఇలాంటి సురక్షిత పద్ధతులనే ఉపయోగిస్తారు. కానీ.. అమెరికాలో మాత్రం దీర్ఘకాలంగా ఇది సరైన విధంగా అమలు కావట్లేదని అర్థమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.