ETV Bharat / international

ఎన్నికల అవకతవకల అంశంలో ట్రంప్​పై దర్యాప్తు - జార్జియా రాష్ట్రం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఎన్నికలలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జార్జియా కోర్టు నేర దర్యాప్తుకు ఆదేశించింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర అధికారులకు నోటీసులు జారీ చేసింది.

criminal probe, trump
ట్రంప్​పై క్రిమినల్ దర్యాప్తు!
author img

By

Published : Feb 11, 2021, 7:59 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై జార్జియాలోని ఫుల్టన్​ కౌంటీ జిల్లా కోర్టు నేర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయంపై సంబంధిత అధికారులకు బుధవారం నోటీసులు జారీ చేసింది. దర్యాప్తునకు అధికారులు అన్ని విధాల సహకరిస్తారని ఆశిస్తామని కోర్టు నోటీసుల్లో పేర్కొంది.

ఎన్నికల వేళ ట్రంప్​, జార్జియా రాష్ట్ర మంత్రి బ్రాడ్​ రాఫెన్స్​పెర్జర్​ మధ్య జరిగిన ఫోన్​ సంభాషణ ఇటీవల బహిర్గతమైంది. ఇప్పటికే అభిశంసన ప్రక్రియతో సతమతమవుతున్న ట్రంప్​నకు ఈ చర్య గుదిబండగా మారింది.

సంభాషణల్లో..

గతేడాది ఎన్నికల సమయంలో బ్రాడ్​ రాఫెన్స్​పెర్జర్​కు ఫోన్​ చేసిన ట్రంప్​.. మరిన్ని ఓట్లు పడేలా ప్రయత్నించాలని ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు పాల్పడ్డారు. మీ వద్ద తప్పుడు సమాచారం ఉందంటూ బ్రాడ్​ బదులు ఇచ్చారు. ఈ రికార్డింగ్​ను స్థానిక మీడియా బహిర్గతం చేసింది. ట్రంప్​పై వస్తున్న ఆరోపణలను రిపబ్లికన్​ నేత అయిన బ్రాడ్​ సమర్థించడం గమనార్హం.

ఇదీ చదవండి : 'అభిశంసన'లో ట్విస్ట్- ట్రంప్​కు సొంత​ లాయర్​ షాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.