ETV Bharat / international

బ్రెజిల్​లో కొవిడ్‌ టీకా వాలంటీరు మృతి! - కరోనా వాలంటీర్​ మృతి

బ్రెజిల్‌లో ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ ప్రయోగ పరీక్షల్లో విషాదం జరిగింది. వ్యాక్సిన్​ వేయించుకోవడానికి ముందుకు వచ్చిన ఓ వాలంటీర్ మృతిచెందాడు. కానీ, టీకా​ వల్ల మరణించాడా లేదా ఇతర కారణాలున్నాయనా అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.

covid vaccine_death
బ్రెజిల్​లో కొవిడ్‌ టీకా వాలంటీరు మృతి!
author img

By

Published : Oct 22, 2020, 6:30 AM IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షల్లో విషాదం చోటుచేసుకుంది! ఆస్ట్రాజెనెకా తయారుచేసిన వ్యాక్సిన్‌ను వేయించుకున్న ఓ వ్యక్తి మరణించినట్టు బ్రెజిల్‌ ఆరోగ్య విభాగం బుధవారం వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో దీనిపై ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి.

మొదటి, రెండోదశ పరీక్షల సందర్భంగా కొద్దిరోజుల కిందట బ్రిటన్‌లో వాలంటీరు ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ వ్యాక్సిన్‌ మూడోదశ పరీక్షలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత బ్రెజిల్‌, బ్రిటన్‌లలో పరీక్షలను పునఃప్రారంభించారు. మూడోదశ క్లినికల్‌ పరీక్షల్లో వ్యాక్సిన్‌ వేయించుకున్న ఓ వ్యక్తి మృతిచెందాడని, ఇందుకు సంబంధించిన 'ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టు' తమకు అందిందని బ్రెజిల్‌ ఆరోగ్య విభాగం వెల్లడించింది. సంబంధిత వ్యక్తి టీకా కారణంగానే మరణించారా? లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? అన్నది అధికారులు చెప్పలేదు. వ్యాక్సిన్‌ తదుపరి పరీక్షలు కొనసాగుతాయని మాత్రం ప్రకటించారు.

వాలంటీరు మృతి వివరాలను సమీక్షించామనీ, తమ వ్యాక్సిన్‌ భద్రతపై అనుమానాలు అక్కర్లేదనీ ఆక్స్‌ఫర్డ్‌ ప్రతినిధి అలెగ్జాండర్‌ బక్స్‌టన్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:ఇకపై రూ. 500కే కరోనా పరీక్షలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.