భారత్‌లో కరోనా రెండో దశ విషాదకరమని భారత సంతతికి చెందిన అమెరికా వైద్య నిపుణుడు డా. వివేక్ మూర్తి పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
"భారత్‌లో ఉన్న పరిస్థితులు విషాదకరం. ఇది అమెరికాలో ఎదురుకాకుండా ఉంటే బాగుంటుంది. కానీ, అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. భారత్‌లో బీ117 రకం కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. సాధారణ వైరస్‌తో పోలిస్తే 50శాతం అధికంగా ఇది వ్యాప్తి చెందుతోంది."
- డా. వివేక్ మూర్తి, అమెరికా సర్జన్ జనరల్
కొవిడ్ మనకు ఏదైనా నేర్పించిందంటే.. అది ఒకరికొకరు సాయంగా నిలబడటమేనని అన్నారు వివేక్ మూర్తి. ప్రపంచానికి టీకాలు అందే విధంగా దేశాలన్నీ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. అందరికీ చికిత్స అందుబాటులో ఉంచాలని... ప్రపంచంలోని ఏ మూలనైనా కొవిడ్ ఉందంటే అది ప్రతి దేశానికీ ముప్పుగా పరిణమించినట్లేనని హెచ్చరించారు.
ఇదీ చదవండి: మనోళ్లు భారత్‌ను చూసి నేర్చుకోవాలి: పాక్ ప్రధాని