ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 69 లక్షల కరోనా మరణాలు!

author img

By

Published : May 7, 2021, 2:30 PM IST

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ కరోనా మృతుల సంఖ్యను తక్కువచేసి చూపుతున్నాయని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​ మెట్రిక్స్​ అండ్ ఎవల్యూయేషన్​(ఐహెచ్​ఎంఈ) వెల్లడించింది. వాస్తవానికి ఇప్పటివరకు సుమారు 69 లక్షల మంది చనిపోయారని అంచనావేసింది. ఇప్పటినుంచి సెప్టెంబర్​ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20లక్షల మరణాలు సంభవించే అవకాశముందని.. అందులో సగం భారత్​లోనే నమోదయ్యే ప్రమాదముందని సంస్థ ప్రొఫెసర్‌ ఒకరు తెలిపారు.

Covid dead bodies, Corona death toll
కరోనా మరణాలు, కొవిడ్​ మృతదేహాలు

ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కొవిడ్‌ మరణాలను తక్కువ చేసి చూపుతున్నట్లు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం వేదికగా పనిచేస్తున్న స్వతంత్ర ప్రపంచ ఆరోగ్య పరిశోధన సంస్థ 'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యూయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ)' పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు కొవిడ్‌తో 69 లక్షల మంది చనిపోయి ఉంటారని ఈ సంస్థ అంచనా వేసింది(గురువారం నాటికి దాదాపు 32.64 లక్షల మంది కొవిడ్‌తో చనిపోయినట్లు వివిధ దేశాలు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి). భారత్‌లో కొవిడ్‌ మృతుల సంఖ్య 6.54 లక్షలకుపైగా ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు అధ్యయన నివేదికను గురువారం విడుదల చేసింది.

ఇదీ చదవండి: 'ఆక్స్​ఫర్డ్ టీకాతో రక్తం గడ్డకట్టే రేటులో పెరుగుదల'

ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం..

ఐహెచ్​ఎంఈ.. 59 దేశాల్లో గల 198 రాష్ట్రాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసింది. "అన్ని రకాల సమాచారాన్ని(డేటాను) విశ్లేషిస్తే.. ప్రస్తుతం లెక్కల్లో చెప్పినదాని కన్నా ఎక్కువగానే మరణాలున్నట్లు నిర్ధరించుకొని వాస్తవానికి దగ్గరగా రావడానికి ప్రయత్నించాం. మరణాలు అధికంగా సంభవించడానికి రకరకాల కారణాలున్నాయి. చాలామంది ప్రజలు ఆసుపత్రులకు దూరంగా ఉన్నారు. కొన్ని దేశాల్లో ఆందోళన(డిప్రెషన్‌)తో పాటు, మందుల వినియోగం పెరిగిపోయింది. ఇలాంటి కారణాల వల్ల కొన్ని మరణాలు పెరిగి ఉండొచ్చు. విభిన్న రకాల ఆంక్షల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 5% మేర రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. లాక్‌డౌన్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ, రెస్పిరేటరీ సినిస్టియల్‌ వైరస్‌(ఆర్‌ఎస్‌వీ) మరణాలు తగ్గాయి. కొవిడ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో.. హృద్రోగం, దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారూ మరణిస్తున్నారు. ఇలాంటి లెక్కలన్నింటినీ కలిపి చూసినప్పుడు మరణాలు అధికారిక లెక్కల కంటే ఎక్కువే ఉన్నాయని అర్థమవుతోంది. ఈ విశ్లేషణతో కరోనా ప్రభావం ఇప్పటివరకు ఊహించిన కంటే ఘోరంగా ఉన్నట్లు తెలుస్తోంది" అని ఆ సంస్థ పేర్కొంది.

ఇదీ చదవండి: ఐరాస నుంచి భారత్​కు 10వేల ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు

'భారత్​లో తీవ్ర స్థాయి మరణాలు!'

ఇప్పటి నుంచి సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని, అందులో సగం వరకు భారత్‌లోనే ఉండే ప్రమాదముందని సంస్థ ప్రొఫెసర్‌ క్రిస్టోఫర్‌ జేఎల్‌ ముర్రే తెలిపారు. ప్రధానంగా తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో మరణాలను తక్కువగా చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఈజిప్ట్‌లో ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే 10 రెట్లు ఎక్కువ మరణాలున్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. పరీక్షలు ఎక్కువ చేయకపోతే లెక్కలోకి రాని కొవిడ్‌ మరణాలు అధికంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ గణాంకాలన్నింటినీ సరిపోల్చుకొని తాము ఈ అంచనా వేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనారోగ్య సమస్యలపై ఏళ్లతరబడి పనిచేస్తున్న అనుభవంతో ఈ లెక్కలు వేసినట్లు వెల్లడించారు. 155 దేశాల్లో 6,500 మందితో కలిసి తాము పనిచేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: వెనక్కితగ్గిన ఆస్ట్రేలియా- ప్రయాణికులపై నిషేధం రద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.