ETV Bharat / international

Vaccination: టీకా తీసుకున్నవారి నుంచి వైరస్ రాదా? - టీకా తీసుకున్న వారి నుంచి కరోనా

వ్యాక్సినేషన్ పూర్తైనవారు మాస్కు, భౌతిక దూరం నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని అమెరికా సీడీసీ ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీకా తీసుకున్న వారికి కొవిడ్ సోకితే వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదా అన్న సందేహం మొదలైంది. మాస్కులు, ఇతర నిబంధనలను పూర్తిగా విస్మరించడం సబబేనా? దీనిపై నిపుణులేమంటున్నారు?

COVID-19 vaccinated people still spread the coronavirus?
కొవిడ్-19
author img

By

Published : May 30, 2021, 2:19 PM IST

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(CDC) మే 13న మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్(Vaccination) పూర్తైనవారు ఇండోర్, ఔట్​డోర్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపింది. మాస్కులు, భౌతిక దూరం నిబంధనలు అవసరం లేదని పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడి వైద్య సలహాదారుడు ఆంటోనీ ఫౌచీ(Anthony Fauci) సైతం.. ఈ నిబంధనలను స్వాగతించారు. శాస్త్రీయత ఆధారంగానే ఈ మార్గదర్శకాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాలో టీకా తీసుకోని మూడింట రెండొంతుల జనాభాకు ఈ మార్గదర్శకాలు ప్రోత్సాహకరంగా ఉంటాయన్నారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి నిబంధనల్లో సడలింపు ఉన్నందున.. అందరూ టీకా తీసుకోవాలని చెబుతున్నారు.

అయితే ఈ మార్గదర్శకాలు కొంతమందిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. అమెరికాలో టీకా తీసుకోని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. చిన్నారులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాలు ఉన్నవారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండొచ్చు. ఇలాంటి వారికి టీకా తీసుకున్న వ్యక్తుల నుంచి వైరస్ వ్యాపిస్తుందేమోనని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

టీకా తీసుకున్నవారు కొవిడ్ వ్యాప్తి చేస్తారా?

టీకా వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వ్యక్తులు వైరస్​ను వ్యాప్తి చేయలేరని కచ్చితంగా చెప్పలేం.

ఇదీ చదవండి- టీకా తీసుకున్నాం.. సేఫ్​గా ఏమేం పనులు చేయొచ్చు​?

కరోనా విషయంలో ఈ విషయాన్ని నిర్ధరించడం మరింత కఠినంగా మారింది. ఎందుకంటే కొవిడ్(COVID-19) సోకుతున్న వారిలో చాలా మందికి లక్షణాలు ఉండటం లేదు. కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహణ సరిగా జరగడం లేదు కాబట్టి లక్షణాల ఉన్న రోగులు వెంటనే బయటపడటం లేదు. వైరస్ నిర్ధరణ అయిన కేసులతో పోలిస్తే లక్షణాలు లేని కేసుల సంఖ్య 3 నుంచి 20 రెట్లు అధికంగా ఉంటుందని కొందరి శాస్త్రవేత్తల అంచనా.

అయితే, సీడీసీ అధ్యయనం మాత్రం సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇతరులతో పోలిస్తే టీకా తీసుకున్న వ్యక్తులకు కొవిడ్ సోకే ముప్పు 25 రెట్లు తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. వ్యాక్సినేషన్ పూర్తైన వ్యక్తులకు వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంది కాబట్టి.. వారి నుంచి ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశం సైతం తక్కువే అని నిపుణులు చెబుతున్నారు. అయితే, జనాభా భారీ స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించకపోతే ఈ భావన నిజమో కాదో అని తెలుసుకోవడం కష్టమవుతుంది.

టీకాల సమర్థత ఎంత?

టీకాలు అన్ని వేళలా వ్యాధిని నివారించవు. టీకా తీసుకున్న వారిలో కనీసం సగం మందికి కొవిడ్ లక్షణాలు తలెత్తకుండా ఉండేలా వ్యాక్సిన్ రూపొందించాలని పరిశోధకులు భావించారు. అదృష్టవశాత్తు వారి అంచనాలను మించి టీకాలు పనిచేస్తున్నాయి. ఉదాహరణకు ఇజ్రాయెల్​లోని 16 ఏళ్లు పైబడిన 65 లక్షల జనాభాలో ఫైజర్ టీకా 95.3 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. టీకా తీసుకున్న 47 లక్షల మందిలో వైరస్ వ్యాప్తి 30 రెట్లు తగ్గింది. ఇదే విధంగా కాలిఫోర్నియా, టెక్సస్ రాష్ట్రాల్లో టీకా తీసుకున్న వైద్య సేవల సిబ్బందిలో కేవలం 0.05 శాతం మందికే కొవిడ్ సోకింది.

వ్యాధిని నివారించడమే కాకుండా కొన్ని సార్లు టీకాల ద్వారా స్టెరిలైజింగ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుంది. శరీరంలోకి వైరస్​ను రానీయకుండా అడ్డుకొని, వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవడాన్నే స్టెరిలైజింగ్ ఇమ్యూనిటీ అంటారు. అయితే కొవిడ్​ టీకా తీసుకున్నవారు ఆ వైరస్ నుంచి ఎంతవరకు రక్షణ పొందుతున్నారు, యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే విషయంపై పరిశోధకులు మరింత అధ్యయం చేస్తున్నారు.

హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమా?

ఇన్ఫెక్షన్ గొలుసును నిర్వీర్యం చేసి వైరస్ వ్యాప్తిని టీకాలు అడ్డుకుంటాయి. ఎక్కువ మందికి టీకాలు అందిస్తే.. వైరస్ వ్యాప్తి ప్రమాదం తగ్గుతుంది. తద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ(herd immunity) సాధ్యమవుతుంది.

ఇదీ చదవండి- టీకా తీసుకుంటే.. 94% ఆసుపత్రి ముప్పు తప్పినట్లే!

అయితే, హెర్డ్ ఇమ్యూనిటీకి టీకా ఒక్కటే మార్గం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇదివరకు వ్యాపించిన ప్రమాదకరమైన వ్యాధులను నివారించేందుకు కొన్నేళ్ల సమయం పట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టీకాలు అందుబాటులోకి వచ్చిన చాలా ఏళ్ల తర్వాతే మీజిల్స్(measles), ఆటలమ్మ(chickenpox), కోరింత దగ్గు(pertussis) వ్యాధులు అంతరించే స్థాయికి చేరాయని చెబుతున్నారు. అయితే ఈ తరహా వ్యాధులు మళ్లీ వ్యాపించే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇదే విధంగా టీకా తీసుకున్న వ్యక్తుల్లోనూ వైరస్ విజృంభించే అవకాశం ఉందని అంటున్నారు.

సీడీసీ మార్గదర్శకాలు: మాస్కు ధరించాలా వద్దా?

వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు వైరస్ భయం లేదని భరోసా ఇచ్చేందుకే సీడీసీ మార్గదర్శకాలు సవరించింది. తీవ్రమైన వ్యాధి నుంచి టీకాలు రక్షణ కల్పిస్తాయని చెప్పేందుకే మాస్కు నిబంధనను సడలించింది.

టీకా తీసుకున్నవారు వైరస్ వ్యాప్తిని తగ్గిస్తున్నారనేందుకు ఆధారాలున్నాయి. కానీ, టీకా తీసుకోని వ్యక్తుల విషయంలోనే స్పష్టత కొరవడింది. కాబట్టి వైరస్ నుంచి మరింత రక్షణ పొందేందుకు నిబంధనలను పాటించడమే మేలు. వ్యాక్సినేషన్​తో పాటు మాస్కు, భౌతిక దూరం కొనసాగిస్తే వైరస్ వ్యాప్తిని మరింత తగ్గించవచ్చు.

ఇదీ చదవండి- ఎక్కువ మందికి టీకా అందితే మాస్క్​ పక్కన పెట్టొచ్చా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.