ETV Bharat / international

ఇలా చేస్తే ఎన్​-95 మాస్కులను మళ్లీ వాడొచ్చా?

author img

By

Published : Aug 28, 2020, 7:01 PM IST

కరోనా బారి నుంచి రక్షించే ఎన్​-95 మాస్కులను ఒకటి కన్నా ఎక్కువసార్లు ఉపయోగించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే పూర్తిగా శానిటైజ్​ చేసిన తర్వాతనే వీటిని వినియోగించాలని స్ఫష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఆరోగ్య వనరుల కొరత తగ్గించేందుకు ఇది ఎంతో ముఖ్యమని చెబుతున్నారు పరిశోధకులు.

mask-reuse
ఎన్​-95

కరోనా వ్యాపించకుండా ఎన్​-95 మాస్కులు సమర్థంగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందించే వైద్యులు కూడా తమ రక్షణ కోసం ఎన్​-95 మాస్కులకే ప్రాధాన్యం ఇస్తారు.

అయితే, వీటిని ఒకేసారి వినియోగించే అవకాశం ఉంది. కానీ, పూర్తిగా శుభ్రం చేశాక మరోసారి వాడొచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇలా అదనంగా 3 సార్లు వినియోగించవచ్చని చెబుతున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు.

కొరత తగ్గించేందుకు..

ఈ విషయానికి సంబంధించిన అధ్యయన ఫలితాలను 'ఎమర్జింగ్ ఇన్పెక్షియస్​ డిసీజెస్​' అనే జర్నల్​లో ప్రచురించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్య వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. మాస్కుల కొరత పెరుగుతున్న కారణంగా శుభ్రం చేసే పద్ధతులపై దృష్టి సారించాల్సి వస్తోందని తెలిపారు.

హైడ్రోజన్ పెరాక్సైడ్​ ఆవిరితో..

అధ్యయనంలో భాగంగా వివిధ పద్ధతుల్లో మాస్కులను శుభ్రం చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆవిరి, అతినీలలోహిత కిరణాలు, 70 డిగ్రీల వరకు వేడి చేయటం, 70శాతం ఇథనాల్.. ఈ పద్ధతుల్లో శానిటైజ్ చేశామన్నారు. ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్​ మంచి ఫలితాలను ఇచ్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి నియంత్రణలో ఎన్​95 భేష్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.