ETV Bharat / international

'బయో ఉగ్రదాడికి ట్రైలర్​ ఈ కరోనా సంక్షోభం' - కరోనా వైరస్​

ఓ బయో ఉగ్రవాద​ దాడి జరిగితే.. దాని పరిణమాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులు చాలని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్​ అన్నారు. దుష్టశక్తులు ఇలాంటి వైరస్​ను ఓ ఆయుధంగా మలుచుకునే ప్రమాదముందని ప్రపంచదేశాలను హెచ్చరించారు.

COVID-19 pandemic provides “window” into how bio-terrorist attack might unfold in world: Guterres
'బయో టెర్రరిస్ట్​ దాడి జరిగితే.. ఇలాగే ఉంటుంది'
author img

By

Published : Apr 10, 2020, 10:45 AM IST

కరోనా వైరస్​తో ప్రపంచం గడగడలాడుతోంది. ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. వైరస్​ను కట్టడి చేయలేకపోతున్నాయి. అయితే ఓ బయో ఉగ్రవాద​ దాడి జరిగితే.. పరిస్థితులు ఎలా ఉంటాయో తాజా పరిణామాల నుంచి అవగాహన పొందొచ్చని అభిప్రాయపడ్డారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. దుష్ట శక్తులు ఇలాంటి వైరస్​ను ఓ ఆయుధంగా ఉపయోగించుకునే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఈ మహమ్మారి ప్రపంచ దేశాల్లో ఉన్న బలహీనతలు, సంసిద్ధతలో ఉన్న లోపాలను బయటపెట్టింది. ఓ బయో ఉగ్ర​ దాడి జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులు చాలు. దుష్టశక్తుల చేతిలో ఇలాంటి వైరస్​ పడితే.. ప్రపంచంలో విధ్వంసం తప్పదు."

-- ఆంటోనియో గుటెరస్​, ఐరాస ప్రధాన కార్యదర్శి.

ఉగ్రవాదుల నుంచి ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని గుటెరస్​ అభిప్రాయపడ్డారు. మహమ్మారితో పోరాటానికి ప్రభుత్వాలు శ్రమిస్తుంటే.. ఇదే అదనుగా ముష్కరులు చెలరేగిపోయే అవకాశముందని హెచ్చరించారు.

వివిధ మానవ హక్కులు, శరణార్థులు, బడుగు బలహీన వర్గాలకు ఈ వైరస్​ సవాళ్లు విసురుతోందని అభిప్రాయపడ్డారు గుటెరస్​.

యూఎన్​ఎస్​సీ సమావేశం...

కరోనా మహమ్మారిపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) తొలిసారి సమావేశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యమత్యంగా ఉంటూ.. వైరస్​ బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తాజా పరిస్థితులను గుటెరస్​ మండలి సభ్యులకు వివరించారు. ప్రాణాంతక మహమ్మారిపై గుటెరస్​ నేతృత్వంలో జరుగుతున్న పోరుకు మద్దతుగా నిలవాలని మండలి సభ్యులు నిర్ణయించారు.

ఇదీ చూడండి:- కరోనాతో పేదరికంలోకి 50 కోట్ల మంది ప్రజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.