ETV Bharat / international

కరోనా పంజా: బాల కార్మికులుగా లక్షలాది మంది

author img

By

Published : Jun 15, 2020, 2:27 PM IST

కరోనా సంక్షోభం వల్ల చిన్నారులు బాల కార్మిక వ్యవస్థ కోరల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని ఐరాస అంచనా వేసింది. లక్షలాది మంది చిన్నారులు బాల కార్మికులుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పేదరికం పెరగడం వల్ల దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న కుటుంబాలు తమ మనుగడ సాగించేందుకు చిన్నారులపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంది.

child labour unicef ilo
కరోనా కాటు- లక్షలాది మంది బాలకార్మికులుగా మారే ప్రమాదం

కరోనా మహమ్మారి వల్ల లక్షలాది మంది చిన్నారులు బాల కార్మికులుగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. గత 20 ఏళ్లుగా తగ్గుముఖం పడుతున్న బాల కార్మికులు కొవిడ్ కారణంగా మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్​ఓ), యునిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది. ఈ మేరకు రెండు సంస్థలు కలిసి 'కొవిడ్​-19: బాల కార్మికులు-సంక్షోభ సమయం, స్పందించాల్సిన సమయం' పేరిట నివేదిక విడుదల చేశాయి.

పేదరికం వల్లే..

2000 సంవత్సరం నుంచి 9.4 కోట్ల మేర బాల కార్మికులు తగ్గినట్లు నివేదిక తెలిపింది. అయితే ఈ ఒరవడికి ప్రస్తుతం విఘాతం కలుగుతోందని పేర్కొంది. కరోనా వల్ల పేదరికం పెరిగిపోతోందని ఫలితంగా కుటుంబాలు మనుగడ సాగించేందుకు చిన్నారులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని నివేదిక వెల్లడించింది. కొన్ని దేశాల్లో ఒక శాతం పేదరికం పెరిగితే.. 0.7శాతం మేర బాల కార్మికులు పెరుగుతున్నారన్న అధ్యయనాల సారాంశాన్ని నివేదిక ప్రస్తావించింది.

"కుటుంబ ఆదాయాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినందున.. చాలా మంది తమ పిల్లలను పనికి పంపిస్తున్నారు. అందువల్ల సంక్షోభ సమయంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయాలి. విద్య, సామాజిక రక్షణ, న్యాయం అందించాలి."

-గయ్ రైడర్, అంతర్జాతీయ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్

కొవిడ్ కారణంగా ఏర్పడిన ఆర్థిక మందగమనం వల్ల అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారు, వలస కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతోందని నివేదిక స్పష్టం చేసింది. నిరుద్యోగం పెరగడం, జీవన ప్రమాణాలు పడిపోవడం, సామాజిక రక్షణ లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వెల్లడించింది.

100 కోట్ల మంది చిన్నారులపై ప్రభావం!

పాఠశాలలు మూసివేడం కూడా బాల కార్మికులు పెరగడానికి కారణమవుతోందని నివేదిక పేర్కొంది. బడులు తాత్కాలికంగా మూసివేయడం వల్ల 130 దేశాల్లోని దాదాపు 100 కోట్ల మందిపై ప్రభావం పడుతోందని వివరించింది. ఒకవేళ పునఃప్రారంభమైనా.. కొంతమంది తల్లితండ్రులు స్తోమత లేక వారి పిల్లలను పాఠశాలలకు పంపించే అవకాశం లేదని అంచనా వేసింది. ఫలితంగా చాలా మంది పిల్లలు ప్రమాదకరమైన ఉద్యోగాలకు వెళ్లాల్సి వస్తుందని, లింగ బేధాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవి పాటించండి

ఈ ప్రమాదాలు రాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని ప్రపంచదేశాలకు సూచించింది. అందరికీ సామాజిక రక్షణ కల్పించాలని... పేద ప్రజలకు సులభంగా రుణాలు అందేలా చూడాలని స్పష్టం చేసింది. యువతకు సరైన ఉపాధి కల్పించాలని, చిన్నారులు మళ్లీ పాఠశాలలకు వచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

ఇదీ చదవండి- కరోనా రోగులతో డాక్టర్ల 'ఫోన్​ కొట్టు- ముచ్చట పెట్టు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.