ETV Bharat / international

జూలో 13 గొరిల్లాలకు కరోనా.. వారే కారణం!

గొరిల్లాలు మరోసారి కరోనా బారినపడ్డాయి. ప్రముఖ అట్లాంటా జూలో 13 వెస్ట్రన్​ లోల్యాండ్​ గొరిల్లాలకు పాజిటివ్​గా తేలింది. జూ సిబ్బంది ద్వారా.. వీటికి వైరస్​ సోకినట్లు అనుమానిస్తున్నారు.

author img

By

Published : Sep 12, 2021, 10:54 AM IST

Atlanta zoo
జూలో 13 గొరిల్లాలకు కరోనా, అట్లాంటా జూ

అమెరికాలోని అట్లాంటా జూలో 13 గొరిల్లాలు కొవిడ్‌ బారినపడ్డాయి. ఇక్కడ సంరక్షణలో ఉన్న వెస్ట్రన్‌ లోల్యాండ్‌ గొరిల్లాల్లో కొన్ని దగ్గు, ముక్కు కారడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు నిర్వాహకులు గుర్తించారు. అనుమానంతో వాటి నుంచి నమూనాలను సేకరించి.. జార్జియా యూనివర్సిటీ ల్యాబ్‌కు పంపించగా రిపోర్టుల్లో కరోనా పాజిటివ్​గా తేలింది.

వీటిల్లో ఎక్కువకాలం జీవించి ఉన్న.. 60 ఏళ్ల గొరిల్లా ఓజీ కూడా ఉంది. ప్రస్తుతం వాటికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూలో మొత్తం 20 గొరిల్లాలు(4 గుంపులుగా) ఉన్నాయి. ముందుజాగ్రత్తగా మిగతావాటన్నింటికీ కొవిడ్​ టెస్టులు చేయనున్నట్లు వెల్లడించారు.

సిబ్బంది నుంచే..

గొరిల్లాల నిర్వహణ చూసే సిబ్బంది ఒకరి నుంచి.. వీటికి కరోనా సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ వ్యక్తి.. టీకా రెండు డోసులు తీసుకున్నాడని, క్రమంగా మాస్కులు, గ్లౌజులు ధరించేవాడని తెలిపారు.

అంతకుముందు జనవరిలో.. అమెరికా శాన్​ డీగో జూలోని కొన్ని గొరిల్లాలకు కరోనా సోకింది. వీటికి ప్రత్యేక చికిత్స అందించి కాపాడారు. అనంతరం.. వాటికి కరోనా టీకా కూడా వేశారు. అంతరించిపోతున్న గొరిల్లా, చింపాంజీల సంరక్షణలో శాన్​ డీగో జూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

జంతువులకు కరోనా సోకిన సంఘటనలు ఇటీవల చాలానే జరిగాయి. మార్చి నెలలో హైదరాబాద్​లోని నెహ్రూ జూ లాజికల్ పార్కులో ఎనిమిది ఆసియా సింహాలు కొవిడ్ బారిన పడ్డాయి.

చెన్నైలోని వాండలూర్‌ అన్నా జూపార్కులో ఈ జూన్​లో నాలుగు సింహాలకు కరోనా 'డెల్టా వేరియంట్‌' సోకినట్లు జూ సిబ్బంది నిర్ధరించారు.

ఇవీ చూడండి: ఆ జూలోని గొరిల్లాలకు కరోనా టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.