ETV Bharat / international

అమెరికాలో సగం మంది పెద్దలకు టీకా పంపిణీ పూర్తి

అమెరికాలో సగం మంది పెద్దలకు కరోనా టీకా పంపిణీ పూర్తయినట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. జులై 4 వరకు 70 శాతం మంది పెద్దలకు పూర్తి వ్యాక్సినేషన్​ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్వేతసౌధంలో కొవిడ్ సలహాదారు అండీ స్లావిట్ తెలిపారు.

author img

By

Published : May 26, 2021, 10:28 AM IST

biden
బైడెన్

అమెరికాలో 50 శాతం మంది పెద్దలకు కరోనా టీకా పంపిణీ పూర్తయినట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. వారంతా మాస్కు పెట్టుకోనవసరం లేదని శ్వేతసౌధంలో కొవిడ్ సలహాదారు అండీ స్లావిట్ తెలిపారు.

బైడెన్ తదుపరి లక్ష్యం 70 శాతం మంది పెద్దలకు కరోనా టీకా పంపిణీ పూర్తి చేయడమేనని అన్నారు. ఆ లక్ష్యాన్ని జులై 4 వరకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 159 మిలియన్ల మంది టీకా వేసుకున్నట్లు తెలిపారు.

అమెరికాలో ఫైజర్, మోడెర్నా టీకాలకు డిసెంబర్​లో అత్యవసర అనుమతినిచ్చారు. ఫిబ్రవరిలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా వినియోగంలోకి వచ్చింది.

ఇదీ చదవండి: 'గత 40 ఏళ్లలో లేని విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.