ETV Bharat / international

'ఆధునిక ప్రపంచంలో తిరుగుబాట్లకు స్థానం లేదు' - ఆంటోనియో గుటెరస్​

మయన్మార్​లో సైనిక తిరుగుబాటును సూచిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఐరాస అధినేత ఆంటోనియో గుటెరస్​. అణచివేత విధానాలకు స్వస్తి పలికి, నిర్బంధంలోని వారిని విడుదల చేయాలని పిలుపునిచ్చారు. సమకాలీన ప్రపంచంలో తిరుగుబాట్లకు స్థానం లేదని నొక్కి చెప్పారు. రాజకీయ, పౌర హక్కులపై కరోనా వైరస్​ సైతం ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

UN chief
ఐరాస అధినేత ఆంటోనియో గుటెరస్​
author img

By

Published : Feb 23, 2021, 5:05 AM IST

ఆధునిక ప్రపంచంలో తిరుగుబాట్లకు చోటు లేదని నొక్కి చెప్పారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. మయన్మార్​ సైన్యం అవలంభిస్తున్న అణచివేత విధానాలను వెంటనే ఆపాలని పిలుపునిచ్చారు. నిర్బంధంలోని వారిని విడుదల చేసి, ఇటీవలి ఎన్నికల్లో ప్రజల అభిష్టాన్ని, మానవ హక్కులను గౌరవించాలని సూచించారు.

ఐరాస మానవ హక్కుల మండలి 46వ సాధారణ సమావేశంలో వీడియో సందేశం అందించారు గుటెరస్​. మయన్మార్​లో తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.

" సైన్యాన్ని వినియోగించి అరెస్టులు, నిర్బంధించటం వంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడాన్ని మనం చూస్తున్నాం. ప్రజా జీవనంపై ఆంక్షలు, పౌర సమాజంపై దాడులు, మైనారిటీలపై ఉల్లంఘనలు వంటివి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రోహింగ్యాలపై దాడులు పెరుగుతున్నాయి. ఇవన్నీ తిరుగుబాటు అనే తుపానులో కలిసి వస్తున్నాయి. అణచివేతను మయన్మార్​ సైన్యం వెంటనే ఆపాలి. నిర్బంధంలోని వారిని విడిచిపెట్టి హింసకు ముగింపు పలకాలి. మానవ హక్కులను గౌరవించాలి. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో తిరుగుబాట్లకు స్థానం లేదు. "

- ఆంటోనియో గుటెరస్​, ఐరాస అధినేత

కరోనా మహమ్మారి సైతం రాజకీయ, పౌర హక్కులపై ప్రభావం చూపుతోందన్నారు గుటెరస్​. మానవ సంబంధాలను మరింత దెబ్బతీస్తోందని తెలిపారు. కరోనా వైరస్​ కట్టడి పేరుతో భారీగా సాయుధ దళాల మోహరింపు, అత్యవసర చర్యలు, స్వేచ్ఛను కూడా నేరంగా పరిగణించటం, స్వతంత్ర నివేదికలను అణగదొక్కటం, ప్రభుత్వయేతర సంస్థల కార్యకలాపాలను నిరోధించటం వంటివి చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మానవ హక్కుల పరిరక్షకులు, పాత్రికేయులు, న్యాయవాదులు, రాజకీయ కార్యకర్తలతో పాటు వైద్య నిపుణులను సైతం అరెస్టులు చేయటం వంటి చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన చెందారు. మహమ్మారి సంబంధిత ఆంక్షలు.. ఎన్నికల ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నాయని ఆరోపించారు.

ఇదీ చూడండి: బ్రిక్స్​ విషయంలో భారత్​కు చైనా మద్దతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.