ETV Bharat / international

నకిలీ వార్తలపై పోరు- ఐరాసలో 20 దేశాల ఒప్పందం - నకిలీ వార్తలపై ప్రపంచ దేశాల పోరు

ఐరాస వేదికగా నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు 20 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై ఫ్రాన్స్​, బ్రిటన్​ సహా భారత్ సంతకం చేసింది.

నకిలీ వార్తలపై పోరు- ఐరాసలో 20 దేశాల ఒప్పందం
author img

By

Published : Sep 28, 2019, 6:30 AM IST

Updated : Oct 2, 2019, 7:28 AM IST

అంతర్జాలంలో నకిలీ వార్తలు రోజూ కోకొల్లలుగా దర్శనమిస్తాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఐరాస వేదికగా నడుం బిగించాయి ప్రపంచదేశాలు. మొత్తం 20 దేశాలు నకిలీ వార్తలను అరికట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి.

ఒప్పందంపై సంతకం చేసిన దేశాల్లో ఫ్రాన్స్​, బ్రిటన్​, దక్షిణాఫ్రికా, కెనడా, భారత్​ సహా మరికొన్ని దేశాలు ఉన్నాయి. విశ్వసనీయ, వైవిధ్య, నమ్మదగిన వార్తలను మాత్రమే వ్యాప్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఒప్పందంలో పేర్కొన్నాయి సభ్యదేశాలు.

"డిజిటల్​ ప్రపంచం విస్తారంగా వ్యాప్తి చెందుతోంది. సమాచార వ్యవస్థను నిత్య వార్తల ప్రవాహం కదిలిస్తోంది. ఇందులో పురోగతి ఎంత మేర ఉందో.. ప్రమాదమూ అంతే పొంచి ఉంది." - జీన్​ ఎవెస్​ లీ, ఫ్రాన్స్​ విదేశాంగ మంత్రి

ముఖ్యంగా ఎన్నికల సమయంలో వేల కొద్ది నకిలీ వార్తలను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రిపోర్టర్స్​ విత్​ఔట్​ బోర్డర్స్​ (ఆర్​ఎస్​ఎఫ్) అనే ఓ పత్రికా వేగు పేర్కొంది.

గతవారం ట్విట్టర్​ అసత్యవార్తలను ప్రచారం చేస్తోన్న వేల ఖాతాలను మూసివేసింది. హాంకాంగ్​ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు చైనా నుంచి పనిచేస్తోన్న నకిలీ ఖాతాలను ట్విట్టర్​ కనిపెట్టింది. ఫేస్​బుక్ గత నెలలో ఈజిప్ట్​, సౌదీ అరేబియా, యూఏఈకి చెందిన పలు నకిలీ ఖాతాలను నిలిపివేసింది.​

Panaji (Goa), Sep 28 (ANI): Tourists, environmentalists came together on streets of Goa to protest against climate change. Protest comes after United Nations summit on climate change. Protestors held placards to highlight the threat of global warming. Children also joined the cause to ensure their better future. The protest was organised by Goa-based environmental activists group Goa Green Brigade.
Last Updated : Oct 2, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.