ETV Bharat / international

'ఆ దేశ ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్' - కరోనా వ్యాక్సిన్ అమెరికా

కరోనా వ్యాక్సిన్​ను అమెరికా పౌరులకు ఉచితంగానే అందజేస్తామని ఆ దేశ అధికారులు తెలిపారు. టీకా తయారీ విషయంలో రెగ్యులేటరీ నిబంధనలను అతిక్రమించడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, టీకాను రష్యా పూర్తి స్థాయిలో పరీక్షించిందా లేదా అన్న విషయంపై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అనుమానం వ్యక్తం చేశారు.

Coronavirus Vaccine Will Be Free For Americans: US Officials
'అమెరికా ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్'
author img

By

Published : Aug 14, 2020, 1:20 PM IST

కరోనా వ్యాక్సిన్ సమర్థవంతమని తేలితే అమెరికా ప్రజలకు ఉచితంగానే సరఫరా చేస్తామని అక్కడి అధికారులు ప్రకటించారు. ప్రజా సంక్షేమం విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.

అయితే టీకా సత్వర తయారీకి రెగ్యులేటరీ నిబంధనలను మేం సడలించడం లేదని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి పాల్ మ్యాంగో పేర్కొన్నారు. టీకాను తప్పక పరీక్షించి సామర్థ్యాన్ని అంచనా వేస్తామని తెలిపారు.

టీకా ప్రాజెక్టులపై అమెరికా ఇప్పటికే 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. కోట్ల కొద్దీ డోసులు అందజేసేలా పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. క్లినికల్ ట్రయల్స్​ తర్వాత వీటిని అందించేలా అంగీకారానికి వచ్చాయి.

ఇతర ఖర్చులూ బీమాలోకి

వ్యాక్సిన్ డోసులకు ప్రభుత్వమే చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. వైద్యులు, క్లినిక్​ల ద్వారా అయ్యే ఖర్చులు సైతం బీమా పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.

అదనపు ఖర్చులను మాఫీ చేసేందుకూ వాణిజ్య బీమా సంస్థలు ముందుకొచ్చినట్లు మ్యాంగో తెలిపారు. 2021 జనవరి నాటికి వందలాది మిలియన్ల డోసులు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

అనుమానమే

మరోవైపు రష్యా తయారు చేసిన టీకాపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ స్పందించారు. టీకా సురక్షితం, సమర్థవంతమని రష్యా నిర్ధరించిందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే నిజంగా టీకాను పరీక్షించారా లేదా అన్న విషయంపై అనుమానం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.