కరోనా వైరస్ నిర్మాణంలో ప్రత్యేక లక్షణాలున్నట్లు గుర్తించారు పరిశోధకులు. మనుషుల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటానికి ఇదొక కారణమవ్వచని భావిస్తున్నారు. వ్యాధి కోసం కొత్త మందులను తయారుచేసేందుకు ఈ అధ్యయనం ఫలితం ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ బయోలాజీలో ఈ పరిశోధన ప్రచురితమైంది. కణాల్లోకి ప్రవేశించేందుకు వీలు కల్పించే సార్స్-సీఓవీ2 స్పైక్ ప్రోటీన్లలో స్ట్రక్చరల్ లూప్‌ను గుర్తించినట్టు అమెరికాలోని కార్న్వెల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ఈ లూప్‌లో నాలుగు అమినో యాసిడ్ల సీక్వెన్స్ ఉందని.. ఇవన్నీ ప్రోటీన్‌ను నిర్మించాయని వెల్లడించారు. అందుకే ఈ వైరస్.. ఇతర కరోనా వైరస్‌లకు భిన్నంగా ఉందని వివరించారు.
సార్స్-సీఓవీ2 లక్షణాలు సార్స్-సీఓవీ1, హెచ్‌సీఓవీ-హెచ్‌కేయూ1 వైరస్ల లక్షణాల కలయికతో ఉందని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ సార్స్-సీఓవీ2 అత్యంత ప్రమాకరమని, ఎక్కువగా వ్యాపిస్తుందని పేర్కొన్నారు.
కణాలపై దాడి చేయాలంటే స్పైక్ ప్రోటీన్ల లక్షణాలు ఓ రిసెప్టర్‌తో బంధించి ఉండాలని.. అవి హోస్ట్ సెల్ ఉపరితలంపై ఉండాలని వెల్లడించారు పరిశోధకులు. పిల్లులకు ఈ రిసెప్టర్ బైండింగ్ ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే పిల్లులు.. మనుషులకు వైరస్‌ను వ్యాపింపచేస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.