ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు మూడు అడుగుల(1 మీటరు) సామాజిక దూరాన్ని తప్పకుండా పాటిస్తున్నారు ప్రజలు. అయితే ఒక్కమీటరు దూరం పాటించినంత మాత్రాన వైరస్ విస్తరణకు అడ్డుకట్టవేయలేమంటోంది ఓ అధ్యయనం.
దూరం సరిపోదు..
మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ అసోసియెట్ ప్రొఫెసర్ లిదియా బౌరోయిబా నిర్వహించిన ఓ అధ్యయనం అమెరికా వైద్య సంఘం జర్నల్లో ప్రచురితమైంది. ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) , అమెరికా వ్యాధి నియంత్రణ-నిరోధక కేంద్రం(సీడీసీ)లు 1930 నాటి కాలం చెల్లిపోయిన ప్రమాణాల ప్రకారం సామాజిక దూరాన్ని నిర్ధేశించాయని తేలింది. ఈ దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయడం అసంభవమని పేర్కొంది.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి గుప్పున ప్రయాణిస్తుంది. తుంపర్లలోని వైరస్ ఎంత బరువుతో ఉన్నా 23నుంచి 27 అడుగుల దూరం వరకు ప్రయాణించగలదు, వ్యాధికారకాలు 8మీటర్లు వ్యాపిస్తాయని బౌరోయిబా తెలిపారు.
అందుకే కరోనా సోకిన వ్యక్తి ఒక్కసారి దగ్గినా, తుమ్మినా ఆ వైరస్ దాదాపు 7-8 మీటర్ల దూరం గాల్లో ప్రయాణిస్తుందన్నారు. అందువల్ల ఒక్క మీటరు దూరం పాటించడం వల్ల కొవిడ్-19 సోకకుండా ఆపలేమని స్పష్టం చేశారు.
"తుంపర్లలో ఉండే తేమ, వెచ్చదనం వల్ల వైరస్ గాల్లో త్వరగా ఆవిరి అవ్వదు. ఈ సమయంలో వైరస్ జీవిత కాలం వెయ్యి రెట్లు పెరుగుతుంది. ఒక్క మిల్లీ సెకను నుంచి దాని జీవ ప్రమాణం కొన్ని నిమిషాలకు పెరిగిపోతుంది. అందుకే ప్రస్తుతం నియంత్రణ విధానాలు అమలు చేస్తున్నప్పటికీ.. కొవిడ్-19 వేగవంతమైన వ్యాప్తిని అరికట్టలేకపోతున్నాం."
-లిదియా బౌరోయిబా, పరిశోధకులు
ఇదీ చదవండి:'తిండి లేదు... బీర్లతోనే సరిపెట్టుకుంటున్నాం సార్'