ETV Bharat / international

బ్రెజిల్​లో కరోనా విలయం- ఒక్కరోజులో 31,475 కేసులు - కరోనా వైరస్ తాజా వార్తలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తోంది. మొత్తం కేసులు 84 లక్షలకు చేరువగా కాగా.. 4.51 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. బ్రెజిల్​లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

Corona
కరోనా
author img

By

Published : Jun 18, 2020, 8:13 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఇప్పటివరకు వైరస్ బారిన పడినవారి సంఖ్య 83,99,486కు చేరుకుంది. కరోనా కారణంగా 4,51,257 మంది మృత్యువాత పడ్డారు. 44.14లక్షల మంది కోలుకున్నారు.

అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజులోనే 26 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 22.34 లక్షలకు చేరింది. కరోనా బారిన పడి తాజాగా 809 మంది మృతిచెందగా మొత్తం 1,19,941 మంది మరణించారు.

బ్రెజిల్​లో భారీగా..

దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్​లో మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 31,475 మందికి వైరస్​ సోకింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9.6 లక్షలకు పెరిగింది. ఒక్కరోజే 1,209 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 46,665కు చేరింది.

రష్యాలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతన్నాయి. ఇప్పటివరకు మొత్తం 5.5 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. రష్యాలో మరణాల సంఖ్య మాత్రం అదుపులోనే ఉంది. ఆ దేశంలో 7,478 మంది మృతిచెందారు.

వివిధ దేశాల్లో ఇలా..

పెరూ, చిలీ, మెక్సికో, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్​లో రోజురోజుకూ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది.

ఫ్రాన్స్​, ఇటలీలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోన్నా బ్రిటన్​, ఇరాన్​, జర్మనీల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.