ETV Bharat / international

11 లక్షలకు చేరువలో కరోనా వైరస్​ కేసులు

కరోనా వైరస్​తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 10లక్షల 96వేల 570మందికి వైరస్​ సోకింది. మృతుల సంఖ్య కూడా 60వేలకు చేరువలో ఉంది. ఇప్పటివరకు మొత్తం 59వేల 125మంది ప్రాణాలు కోల్పోగా.. వీరిలో 40వేలకుపైగా మంది ఒక్క ఐరోపాకు చెందినవారే.

CORONA VIRUS WORLDWIDE CASES AND DEATH TOLL
60వేలకు చేరువలో కరోనా మృతులు
author img

By

Published : Apr 4, 2020, 5:00 AM IST

కరోనా వైరస్​.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. వైరస్​ ధాటికి అనేక దేశాలు లాక్​డౌన్​లోకి జారుకున్నాయి. మరికొన్ని దేశాలు కర్ఫ్యూ అస్త్రాన్ని ప్రయోగించాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా వైరస్​ కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకు భారీ స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటివరకు 10,96,570మంది వైరస్​ బారిన పడ్డారు. మొత్తం 59వేల 125మంది వైరస్​ సోకి మృతి చెందారు.

ఐరోపా విలవిల...

కరోనా వైరస్​ ధాటికి ఐరోపా విలవిలలాడుతోంది. ఆ ఒక్క ఖండంలోనే 40వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఇటలీ, స్పెయిన్​, ఫ్రాన్స్​ దేశాలున్నాయి.

ఫ్రాన్స్​లో ఒక్క శుక్రవారమే 588మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో అంత మొత్తంలో మరణాలు సంభవించడం ఫ్రాన్స్​లో ఇదే తొలిసారి. వైరస్​ సోకి ఇప్పటివరకు 5వేల 091మంది మృతి చెందినట్టు అక్కడి ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

అయితే కరోనాతో దేశంలోని వృద్ధాశ్రమాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై అస్పష్టత నెలకొంది. ప్రస్తుత గణాంకాలను కలిపితే దేశవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 6,507కు చేరుతుందని అధికారులు తెలిపారు. మొత్తం 64వేల 338 వైరస్​ పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

మరోవైపు ఇటలీ.. వైరస్ అలజడి​ నుంచి బయటపడుతున్నట్టు కనిపిస్తోంది. రోజురోజుకు తగ్గుతున్న మృతుల సంఖ్యే ఇందుకు కారణం. తాజాగా ఆ దేశంలో 766మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 14వేల 681కి చేరింది. మొత్తం 1,19,827మంది వైరస్​ బారినపడ్డారు.

బ్రిటన్​...

బ్రిటన్​లో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 684 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం 3వేల 605మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 38వేల 168మందికి కరోనా పాజిటివ్​గా తేలింది.

corona-virus-worldwide-cases-and-death-toll
వివిధ దేశాల్లో ఇలా

పీ5...

తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ చర్చలు జరిపినట్టు శ్వేతసౌధం వెల్లడించింది. వైరస్​పై పోరుకు పీ5(ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యులు) సమావేశం నిర్వహించడంపై అగ్రనేతలు చర్చించినట్టు తెలిపింది. అమెరికా, బ్రిటన్​, చైనా, ఫ్రాన్స్​, రష్యా.. పీ5 దేశాలుగా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.