ETV Bharat / international

కరోనా పంజా: కోటీ 60 లక్షలకు చేరువలో కేసులు - corona latest news

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. పలు దేశాల్లో సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రోజుకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య కోటీ 60 లక్షలకు చేరువైంది. దాదాపు ఆరున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

corona virus updates worldwide
కోటీ 60 లక్షలకు చేరువలో కేసులు
author img

By

Published : Jul 25, 2020, 9:30 AM IST

Updated : Jul 25, 2020, 9:39 AM IST

ప్రపంచంపై కరోనా రక్కసి కన్నెర్రచేస్తోంది. మృత్యు కోరలు చాస్తోంది. రోజురోజుకు కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రోజూ 2 లక్షలకుపైగా కేసులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగటం కాస్త ఊరట కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటీ 60 లక్షలకు చేరువైంది. సుమారు ఆరున్నర లక్షల మంది మృతి చెందారు.

  • మొత్తం కేసులు: 15,940,379
  • మొత్తం మరణాలు: 642,688
  • కోలుకున్నవారు: 9,723,949
  • యాక్టివ్​ కేసులు: 5,573,742

అమెరికాలో..

అగ్రరాజ్యంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు 70-80 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 42.50 లక్షలకు చేరువైంది. 1.50 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

బ్రెజిల్​లో..

కేసులు, మరణాల్లో రెండోస్థానంలో కొనసాగుతోన్న బ్రెజిల్​లో వైరస్​ వ్యాప్తి తగ్గటం లేదు. రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 23.50 లక్షలకు చేరువైంది. 85 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

రష్యాలో..

రష్యాలో కొవిడ్​ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. 13 వేలకుపైగా వైరస్​కు బలయ్యారు. దాదాపు 6 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు

దేశంమొత్తం కేసులుమరణాలు
అమెరికా4,248,327148,490
బ్రెజిల్​ 2,348,20085,385
రష్యా800,84913,046
దక్షిణాఫ్రికా421,9966,343
మెక్సికో378,28542,645
పెరు375,96117,843
చిలీ341,3048,914
స్పెయిన్319,50128,432
బ్రిటన్297,914 45,677

Last Updated : Jul 25, 2020, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.