కరోనా వైరస్‌తో ప్రపంచం వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 19వేలకు చేరువలో ఉండటం.. ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది.
ప్రాణాంతక మహమ్మారితో ఇప్పటివరకు 18వేల 907మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 4 లక్షల 22వేల 959మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం 1,09,143 మంది మహమ్మారిని జయించారు.
వైరస్ కేంద్రబిందువు చైనాలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనూ కరోనా వ్యాపిస్తోంది. తాజాగా 58మందికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది.
వివిధ దేశాల్లో ఇలా...
దేశం | కేసులు | మృతులు |
చైనా | 81,218 | 3,281 |
ఇటలీ | 69,176 | 6,820 |
అమెరికా | 54,881 | 782 |
స్పెయిన్ | 42,058 | 2,991 |
జర్మనీ | 32,991 | 159 |
ఇరాన్ | 24,811 | 1,934 |
ఫ్రాన్స్ | 22,304 | 1,100 |
స్విట్జర్లాండ్ | 9,877 | 122 |
దక్షిణ కొరియా | 9,137 | 126 |
బ్రిటన్ | 8,077 | 422 |
భారత్ | 562 | 9 |
ఇదీ చూడండి:- కరోనా వైరస్ సోకితే రుచి, వాసన తెలియదు