ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 2,84,725 పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 6,994 మంది వైరస్ కారణంగా మరణించారు.
కేసుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది. బ్రెజిల్, భారత్, రష్యా వరుసగా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే అతి త్వరలోనే భారత్.. బ్రెజిల్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
- మొత్తం కేసులు : 2,61,76,140
- మొత్తం మరణాలు : 8,67,295
- యాక్టివ్ కేసులు : 68,67,389
- రికవరీలు : 1,84,41,456
- అమెరికాలో బుధవారం ఒక్కరోజే 41,211 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 1,090 మంది మరణించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 62.90 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య లక్షా 90 వేలకు చేరువైంది.
- బ్రెజిల్లో కొత్తగా 41,889 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, 1,218 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఆ దేశంలో బాధితుల సంఖ్య 40 లక్షలు దాటింది.
- రష్యాలో తాజాగా 4,952 కేసులు నమోదు కాగా.. బాధితుల సంఖ్య10 లక్షలు దాటింది.
- మెక్సికోలో కొవిడ్ విజృంభిస్తోంది. కొత్తగా 6వేల మందికి కరోనా సోకగా, కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. మరో 827 మంది కరోనాతో మృతిచెందగా.. మరణాల సంఖ్య 65,241కు చేరింది.
- స్పెయిన్‌లో మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా 8,581 కొత్త కేసులు నమోదుకాగా.. బాధితుల సంఖ్య 4.79 లక్షలు దాటింది.
- అర్జెంటీనాలోనూ కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజులోనే 10వేలకుపైగా కొవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో బాధితుల సంఖ్య 4 లక్షల 39 వేలు దాటింది.
ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోందిలా..
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 62,90,737 | 1,89,964 |
బ్రెజిల్ | 40,01,422 | 1,23,899 |
రష్యా | 10,05,000 | 17,414 |
పెరూ | 6,63,437 | 29,259 |
కొలంబియా | 6,33,339 | 20,348 |
దక్షిణాఫ్రికా | 6,30,595 | 14,389 |
మెక్సికో | 6,06,036 | 65,241 |
స్పెయిన్ | 4,79,554 | 29,194 |
ఇదీ చదవండి: ఆరు వారాల్లో ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్!