Corona cases worldwide: ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటం కలవరానికి గురి చేస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో వైరస్ ఉద్ధృతి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులోనే 31లక్షల 26వేల 332 మందికి వైరస్ సోకడం చూస్తే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. అన్ని దేశాల్లో కలిపి కరోనా వల్ల మరో 7,855 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు విశ్వవ్యాప్తంగా 31కోట్ల 72లక్షల 90వేల 957 కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాలు సంఖ్య 55లక్షల 29వేల 817కి చేరింది. 26కోట్ల 27లక్షల 69వేల 645 మంది కోలుకున్నారు. 4కోట్ల 89లక్షల 91వేల 495 యాక్టివ్ కేసులున్నాయి.
- కరోనా వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో ఒక్క రోజు వ్యవధిలో 8లక్షల 14వేల 494 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 2,269 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8లక్షల 66వేల 882కి చేరగా.. కేసుల సంఖ్య 6కోట్ల 43లక్షల 44వేల 694కి పెరిగింది.
- అమెరికా తర్వాత ఫ్రాన్స్‌లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. అక్కడ కొత్తగా 3,61,719 కేసులు బయటపడ్డాయి. మరో 246మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటీ 29లక్షల 34వేల 982కి చేరింది. మృతుల సంఖ్య 1,26,305గా ఉంది.
- ఇటలీలో కొత్తగా 1,96,224 కేసులు వెలుగు చూశాయి. మరో 313 మంది మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 79లక్షల 71వేల 68కి చేరింది. మృతుల సంఖ్య 1,39,872కి పెరిగింది.
- స్పెయిన్లో 1,79,125 కొత్త కేసులు, 125 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 77లక్షల71వేల 367గా, మొత్తం మృతుల సంఖ్య 90,508గా ఉంది.
- అర్జెంటీనాలో కొత్తగా 1,31,082 మందికి వైరస్ సోకింది. మరో 75మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 66లక్షల 64వేల 717కి చేరగా.. మరణాల సంఖ్య 1,17,670గా ఉంది.
- జర్మనీ, బ్రెజిల్, భారత్‌లోనూ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.
ఇదీ చదవండి: '5 నిమిషాల్లో సంక్రమణ సామర్థ్యాన్ని కోల్పోతున్న కరోనా!'