ETV Bharat / international

హైడ్రాక్సీక్లోరోక్విన్​ తీసుకుంటే మరణం అపోహే!

కరోనా చికిత్సలో భాగంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్​ను తీసుకోవడం వల్ల మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొనే అధ్యయనాన్ని వెనక్కి తీసుకుంది లాన్సెట్ సైన్స్ జర్నల్. తమ అధ్యయనానికి సంబంధించిన డేటా కచ్చితత్వాన్ని నిరూపించలేకపోయిన కారణంగానే ఈ నివేదికను వెనక్కి తీసుకుంది.

hydraxi
హైడ్రాక్సీక్లోరోక్విన్​తో మరణం.. అపోహే!
author img

By

Published : Jun 5, 2020, 4:01 PM IST

కరోనా బాధితులు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ను తీసుకోవడం వల్ల మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రకటించిన లాన్సెట్ జర్నల్.. తమ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంది. తమ అధ్యయనానికి వినియోగించిన డేటా కచ్చితత్వాన్ని నిరూపించలేకపోయినందున ఈ నిర్ణయం తీసుకుంది. హైడ్రాక్సీని ఉపయోగించడం వల్ల వ్యక్తులు మరణించే అవకాశం ఎక్కువగా ఉందని వివాదం లేవనెత్తింది లాన్సెట్.

"అధ్యయానాన్ని తయారుచేసిన ముగ్గురు నిపుణులు వారి నివేదిక 'హైడ్రాక్సీక్లోరోక్విన్, మాక్రోలైడ్ చికిత్స.. బహుళ జాతీయ విశ్లేషణ'ను ఉపసంహరించుకున్నారు."

-లాన్సెట్ జర్నల్ ప్రకటన

కారణం ఇదే..

ఈ నివేదికను తయారుచేసిన నిపుణులు కచ్చితత్వాన్ని నిరూపించలేకపోయారు. నివేదికను ఉపసంహరించడంపై స్పందించారు సీఎస్​ఐఆర్ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు అనురాగ్ అగర్వాల్. క్లోరోక్విన్ వల్ల మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందనే అంశాన్ని నిరూపించలేకపయినందునే ఉపసంహరించుకోవలసి వచ్చిందన్నారు.

అధ్యయనం సాగిందిలా..

ట్రయల్స్​ను కొనసాగిస్తే మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. మే 22న ప్రచురించిన ఈ నివేదికను తయారు చేసేందుకు ఆరు ఖండాల్లోని.. 96,000 కరోనా బాధితులను పరిశీలించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు గుండె కొట్టుకునే వేగంపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడించారు. బాధితుల సమాచారాన్ని అమెరికాకు చెందిన సర్గిస్పియర్ కార్పొరేషన్ అనే సంస్థ అందించిందని చెప్పుకొచ్చారు. అయితే బాధితుల కచ్చితమైన సమాచారాన్ని పరిశోధకులు చూపలేకపోయారు.

నివేదికతో డబ్ల్యూహెచ్​ఓ వెనక్కి..

లాన్సెట్ ప్రచురించిన అసమగ్ర నివేదిక ప్రభావం డబ్ల్యూహెచ్​ఓ పరిశోధనలపై పడింది. క్లినికల్ ట్రయల్స్​లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకున్న వారిని పరిశీలించడాన్ని ఆపింది డబ్ల్యూహెచ్​ఓ. అయితే ప్రపంచవ్యాప్తంగా 100 మంది పరిశోధకులు.. ఈ అధ్యయనంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లాన్సెట్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ కు లేఖ రాశారు. హైడ్రాక్సీ ట్రయల్స్ పునః ప్రారంభం కావాలని ఉద్ఘాటించారు.

న్యూజిలాండ్​కు చెందిన వైద్య జర్నల్ కూడా లాన్సెట్ బాటలో నడిచింది. హైడ్రాక్సీ వల్ల గుండె సమస్యలు తలెత్తుతాయన్న నివేదిక అనంతరం తన అధ్యయనాన్ని ఉపసంహరించుకుంటున్నచట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: మాస్క్​ లేదని చలానా​ కట్టమంటే పోలీసులనే కొట్టాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.