ETV Bharat / international

భారీ ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్ ఆమోదం - అమెరికా భారీ ఉద్దీపన

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేసింది అక్కడి ప్రభుత్వం. దాదాపు 900 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. కొవిడ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ ప్యాకేజీ కింద సాయం అందించనున్నారు.

Congress seals agreement on COVID relief, government funding
అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థకు భారీ ఉద్దీపన
author img

By

Published : Dec 21, 2020, 8:53 AM IST

కరోనాతో అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్ధకు ఊతం ఇచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన 900 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది.

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ఈ ప్యాకేజీ కింద వారానికి 300 డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నారు. వ్యాపారాలు దెబ్బతిన్న సంస్థలు సహా పాఠశాలలు, ఆరోగ్య సంస్థలకు సబ్సిడీలు ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కూడా ఈ ప్యాకేజీ కింద నిధులను వెచ్చించనున్నారు. కొవిడ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సాయం కోసం దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ ప్యాకేజీ ఎంతో మేలు చేస్తుందని రిపబ్లికన్‌ నేత మిచ్‌ మెకోనల్‌ తెలిపారు.

ఇదీ చదవండి : 'బెదిరింపులు ఆపండి'- అమెరికాకు చైనా హెచ్చరిక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.