అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో సోమవారం పడవలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరుకుంది. మరో 9మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
ప్రమాద సమయంలో ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 39 మంది ఉన్నారు. వీరంతా సరదాగా స్కూబా డైవింగ్ చేసేందుకు పసిఫిక్ మహాసముద్రంలోని శాంటాక్రూజ్ ద్వీపానికి వెళ్లారు. ద్వీపం వద్ద పడవ నిలిపి ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గుర్తించిన ఐదుగురు సిబ్బంది... పడవ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలినవారిలో అత్యధికులు సజీవ దహనమయ్యారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. 25 మృతదేహాలు వెలికితీశారు. గల్లంతైన మరో 9 మంది కోసం గాలిస్తున్నారు.