ETV Bharat / international

'ట్రంప్​ మరోసారి అధికారంలోకి వస్తే అంతే' - america latest news

అమెరికా అధ్యక్ష పదవి అంటే అవమానించడమే అనే భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని​ తీవ్ర విమర్శలు చేశారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్​ క్లింటన్​. ట్రంప్​ మరోసారి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమెరికన్లకు తెలుసన్నారు. జో బైడెన్​ అధికారంలోకి వస్తే పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని ప్రశంసలు కురిపించారు.

Clinton says Trump sees job as lobbing insults
'ట్రంప్​ మరోసారి అధికారంలోకి వస్తే అంతే'
author img

By

Published : Aug 19, 2020, 11:32 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్. అధ్యక్ష బాధ్యతలను ఆయన విస్మరించారని విమర్శించారు. ట్రంప్​ మరో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంటే అవమానాలు, బెదిరింపులు, నిందలకు శ్వేతసౌధం నిలయమవుతుందని హెచ్చరించారు. అధ్యక్ష పదవి అంటే రోజుకు గంటల తరబడి టీవీ చూడడం, సామాజిక మాధ్యమాల్లో ప్రజల్ని రెచ్చగొట్టడమే అని ట్రంప్ భావిస్తున్నారని మండిపడ్డారు క్లింటన్​.

డెమొక్రటిక్ పార్జీ జాతీయ సదస్సు రెండో రోజున కేవలం ఐదు నిమిషాల పాటే ప్రసంగించారు క్లింటన్​. జో బైడెన్​పై ప్రశంసల వర్షం కురిపించారు. అధ్యక్ష పదవి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగల నాయకుడని కొనియాడారు.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో క్లింటన్ సతీమణి హిల్లరీ పరాజయం చవిచూశారు.

ఇదీ చూడండి: బైడెన్​ను అధికారికంగా నామినేట్ చేసిన​ డెమొక్రటిక్​ పార్టీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.