జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడంపై ఆ దేశ మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశం పంపారు.
బుష్ చూపిన ప్రేమ మర్చిపోలేను:ఒబామా
ప్రమాణస్వీకార కార్యక్రమం... రెండు శతాబ్దాల నుంచి జరుగుతోన్న శాంతియుత అధికార బిదిలీకి నిదర్శనం అని వీడియోలో పేర్కొన్నారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. పదవిలో ఉన్నప్పుడు తమతో ఏకీభవించని వ్యక్తుల మాటనూ వినేవాడినని అన్నారు. 2009 నుంచి 2017 వరకు అధ్యక్ష పదవిలో ఉన్న ఒబామా... తను ప్రమాణస్వీకారం చేసినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. బుష్ తనపై అమితమైన ప్రేమను చూపారని తెలిపారు.
"జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టడం నాకు గర్వంగా ఉంది. కమలా, బైడెన్ల విజయం కోరుతూ ముగ్గురు అధ్యక్షులు వచ్చారు. దేశాభివృద్ధి కోసం మీకు నిరంతరం సూచనలు ఇచ్చేందుకు మేం సిద్ధం."
-బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు.
అధ్యక్ష పదవి చేపట్టడం మన అదృష్టం: బుష్
"ముగ్గురు మాజీ అధ్యక్షులు ఒక చోట నిలబడి అధికార బదిలీ కార్యక్రమం గురించి మాట్లాడడం అమెరికా ఔన్యత్యాన్ని చాటిచెబుతోంది. అమెరికా గొప్ప దేశం. ఈ దేశ ప్రజలు చాలా మంచివారు. మనం ముగ్గురం అమెరికాకు అధ్యక్షులుగా పనిచేయడం గర్వించదగ్గ విషయం." అని ఒబామా, క్లింటన్‌లను ఉద్దేశించి చెప్పారు జార్జ్ బుష్. 2001 నుంచి 2009 వరకు అమెరికా అధ్యక్షునిగా ఉన్నారు బుష్. బైడెన్ అధ్యక్ష పదవికి న్యాయం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి విషయంలో బైడెన్ బృందానికి తాము సలహాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బైడెన్ విజయం సాధిస్తే అది దేశానికి విజయమవుతుందని అన్నారు.
మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత బిల్ క్లింటన్ కూడా బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి:'పెద్దన్నతో కలిసి పని చేసేందుకు సిద్ధం'