అమెరికాను 'క్లౌడెట్టే' వాయుగుండం అతలాకుతలం చేస్తోంది. ఉష్ణమండల తుపాను అయిన క్లౌడెట్టే... ఆదివారం బలహీనపడి ఉష్ణమండల వాయుగుండంగా మారింది. అయితే మళ్లీ తుపానుగా బలపడి.. తూర్పు తీరాన్ని తాకుతుందని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది.
![US CLOUDETTE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12210717_1000-4.jpeg)
![US CLOUDETTE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12210717_1000-1.jpeg)
క్లౌడెట్టే ధాటికి వివిధ ఘటనల్లో 13 మంది మృతి చెందారు. అలబామాలో భారీగా వీచిన గాలులతో ఓ ట్రక్కు క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో వాహనంలో ఉన్న ఇద్దరు సైతం మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
![US CLOUDETTE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12210717_1000-5.jpeg)
![US CLOUDETTE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12210717_1000-3.jpeg)
క్లౌడెట్టే ధాటికి అలబామాలోని బర్మింగ్హమ్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడని అధికారులు తెలిపారు. అతడి జాడ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, జార్జియా, కరోలినా ప్రాంతాల్లో మూడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. నార్త్ కరోలినాలో తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి.
![US CLOUDETTE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12210717_1000-2.jpeg)
![US CLOUDETTE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12210717_1000-6.jpeg)
ఇదీ చదవండి: ఇరాన్లో ఏకైక అణు విద్యుత్ ప్లాంట్ మూసివేత